
పంజాబ్ లో నాణ్యమైన, సరసమైన విద్యను అందించడానికి ఆ రాష్ట్ర సీఎం భగవంత్ మాన్ విద్యా సంస్కరణలను శనివారం ప్రకటించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్య ప్రాముఖ్యతను నొక్కిచెప్పిన సీఎం రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను ‘స్కూల్స్ ఆఫ్ ఎమినెన్స్’ గా మారుస్తామని హామీ ఇచ్చారు. అత్యాధునిక ప్రభుత్వ పాఠశాలలను నిర్మించడమే కాకుండా ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.
‘‘గౌహతిలో ఎంతకాలం దాక్కుంటారు ?’’ - తిరుగుబాటు ఎమ్మెల్యేలకు శివసేన ఎంపీ సంజయ్ రౌత్ వార్నింగ్
పంజాబ్ అసెంబ్లీ సమావేశాలు శనివారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ సీఎం భగవంత్ మాన్ విద్యా సంస్కరణలను ప్రకటించారు. ఫీజు చట్టం 2016ను ఉల్లంఘించిన పాఠశాలల NoC (నో అబ్జెక్షన్ సర్టిఫికేట్)ను రద్దు చేస్తామని ఆయన అన్నారు. అలాగే అలాంటి స్కూళ్లకు రూ. 1 లక్ష జరిమానా విధిస్తామని తెలిపారు. పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల వరకు అన్ని స్థాయిలలో విద్యను మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోందని చెప్పారు. కాలేజీలు, యూనివర్శిటీల్లో నాణ్యమైన విద్యపై దృష్టి సారిస్తామని తెలిపారు. అలాగే అక్కడ పని చేసే లెక్చరర్లకు యూజీసీ పే స్కేలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
నాణ్యమైన సాంకేతిక విద్యను అందించేందుకు ప్రభుత్వం కొత్తగా 19 పారిశ్రామిక శిక్షణా సంస్థలను ఏర్పాటు చేస్తోందని ముఖ్యమంత్రి తెలిపారు. పరిశ్రమల డిమాండ్‌కు అనుగుణంగా 44 కొత్త కోర్సులను వివిధ పారిశ్రామిక శిక్షణా సంస్థల్లో ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నట్టు భగవంత్ మాన్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఖాళీ పోస్టుల భర్తీ ప్రక్రియను ప్రారంభించిందని, 5,994 ఎలిమెంటరీ ట్రైన్డ్ టీచర్లు 8,393 ప్రీ-ప్రైమరీ టీచర్ల రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో ఉందని సీఎం చెప్పారు.
భారత స్వాతంత్రోద్యమానికి ఊపిరులూదిన బార్డోలీ సత్యాగ్రహం
ఇక నుంచి కోర్ టీచింగ్ పనులకు ఉపాధ్యాయులను నియమిస్తామని, నాన్ టీచింగ్ వర్క్స్ కోసం ప్రత్యేక కేడర్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఉపాధ్యాయ శిక్షణ పద్ధతులను పునరుద్ధరించాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పిన సీఎం, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉత్తమ విధానాలను పరిశీలిస్తామని అన్నారు. రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ, న్యూ ఢిల్లీలోని యుఎస్ ఎంబసీ ప్రాంతీయ ఆంగ్ల భాషా కార్యాలయం సహకారంతో ఫ్యాకల్టీ సభ్యులకు శిక్షణ ఇస్తుందని ఆయన పేర్కొన్నారు.
Agnipath : అగ్నిపథ్ ను ఏటా ప్రభుత్వం సమీక్షిస్తుంది.. లోపాలను సరి చేస్తుంది - రాజ్ నాథ్ సింగ్
కాగా రెండు నెలల కిందట పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఢిల్లీలో ప్రభుత్వ విద్యా సంస్థల పని తీరు పరిశీలించిందుకు తన బృందంతో కలిసి వెళ్లారు. ఈ సందర్బంగా అక్కడ ఢిల్లీ ప్రభుత్వం నాణ్యమైన విద్య కోసం అమలు చేస్తున్న సంస్కరణలు, అక్కడ విద్యార్థులకు అందుతున్న విద్య, ఇతర సౌకర్యాలను పరిశీలించారు. అక్కడి విద్యార్థులతో స్వయంగా మాట్లాడి పలు వివరాలు తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ మోడల్ ను పంజాబ్ లో కూడా అమలు చేయాలని భావిస్తున్నట్టు అసెంబ్లీలో సీఎం ప్రకటనతో స్పష్టం అవుతోంది.