ప్రతి యేడాది విడుదల చేసినట్టే 2023 ఏడాదికి సంబంధించి ఎక్కువ మంది ఎవరి గురించి వెతుకుతున్నారో తాజాగా ఓ జాబితా విడుదల చేసింది. ఈ జాబితాలో బాలీవుడ్ ప్రముఖులు, క్రికెట్ ఆటగాళ్లు ఉన్నారు.
Googled Persons: ఏదైనా సమాచారం కోసం లేదా వార్తలు, సెలెబ్రిటీల గాసిప్‌ల గురించి మన దేశంలాగే ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా సెర్చ్ ఇంజిన్ గూగుల్ పైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. గూగుల్ సంస్థ కూడా గత ఐదేళ్లుగా యూజర్లు ఎవరి గురించి ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారనే అంశాన్ని వెల్లడిస్తున్నది. గత ఐదేళ్లలాగే ఈ ఏడాది కూడా 2023లో అత్యధికంగా ఎవరిని గూగుల్‌లో వెతికారో వారి జాబితాను విడుదల చేసింది. ఇండియాలో ఎవరి గురించి ఎక్కువగా వెతికారో కూడా ఆ జాబితాను ఫిల్టర్ చేస్తే అర్థం అవుతుంది.
భారత్‌లో ఎక్కువమంది బాలీవుడ్ సెలెబ్రిటీలు, క్రికెటర్లు, యూట్యూబర్ల గురించి కూడా వెతుకుతున్నారు.
కియారా అద్వానీ: ఈ జాబితాలో టాప్ ప్లేస్‌లో బాలీవుడ్ నటి కియారా అద్వానీ ఉన్నారు. 2023లో ఇండియాలో అత్యధికమంది ఈమె గురించే గూగుల్‌లో వెతికారు. ముఖ్యంగా ఫిబ్రవరిలో ఈ ట్రెండ్ ఇంకా ఎక్కువగా కనిపించింది. ఆ సమయంలో కియారా అద్వాన, హీరో సిద్ధార్థ్ మల్హోత్రాను పెళ్లి చేసుకుంది.
Also Read: Madhya Pradesh CM: ఎవరీ మోహన్ యాదవ్? మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌తో లింక్ ఏమిటీ?
శుభ్‌మన్ గిల్: కియారా తర్వాత టీమిండియా లేటెస్ట్ బ్యాటింగ్ సెన్సేషన్ శుభ్ మన్ గిల్ ఉన్నారు. ఐపీఎల్‌లో గుజరాత్ టైటన్స్ తరఫున ఆడి ఫేమస్ అయ్యారు.
రచిన్ రవీంద్ర: భారత మూలాలు గల న్యూజిలాండ్ బ్యాటర్ రచిన్ రవీంద్ర ఈ జాబితాలో మూడో స్థానంలో నిలిచారు. ఆయన పేరు భారత దిగ్గజాలు రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండుల్కర్‌ల పేర్లతో ప్రేరణ పొందిందనే ప్రచారం జరిగింది. అయితే, అవన్నీవదంతులేనని ఆ తర్వాత తేలింది.
మొహమ్మద్ షమీ: టీమిండియా ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ షమీ 2023 వరల్డ్ కప్ మొత్తం ఒక వెలుగు వెలిగారు. ఈయన గురించి కూడా నెటిజన్లు తెగ వెతికారు.
Also Read: Rythu Bandhu: రైతు భరోసాపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా.. నిధులపై త్వరలో ప్రకటన
ఎల్విశ్ యాదవ్: ఎల్విశ్ యాదవ్ పాపులర్ యూట్యూబర్. సెకండ్ సీజన్ బిగ్ బాస్ ఓటీటీలో విజేత.
ఆ తర్వాత బాలీవుడ్ యాక్టర్ సిద్ధార్థ్ మల్హోత్రా, ఆస్ట్రేలియన్ క్రికెటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్, రిటైర్డ్ ఫుట్‌బాల్ స్టార్ డేవిడ్ బెక్‌హాం, ఇండియన్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్, ఆస్ట్రేలియన్ క్రికెటర్ ట్రావిస్ హెడ్‌ల పేర్లూ వరుసగా ఉన్నాయి.