నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 5,369 ఖాళీల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్

By Mahesh RajamoniFirst Published Mar 14, 2023, 2:46 PM IST
Highlights

Staff Selection Commission (SSC): దేశవ్యాప్తంగా 5,369 ఖాళీల భర్తీకి పరీక్షలు నిర్వహించనున్నట్టు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్సెస్సీ) ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. ప్రామాణిక రుసుము చెల్లింపు సహా ఆన్లైన్ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ మార్చి 27గా పేర్కొంది.
 

Government Jobs Notification: ప్ర‌భుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్.. కేంద్ర ప్ర‌భుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖ‌ల్లో ఉద్యోగ ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌డానికి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్సెస్సీ) నోటిఫికేష‌న్ జారీ చేసింది. మొత్తం 5,369 ఖాళీల భర్తీకి పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపింది. జూన్, జూలై మధ్య 5369 ఖాళీలతో (తాత్కాలిక),  549 (శాశ్వ‌త‌) పోస్టుల రిక్రూట్‌మెంట్ కోసం బహిరంగ పోటీ పరీక్షను నిర్వహించ‌నున్న‌ట్టు ఒక ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. వీటిలో అధికం ద‌క్ష‌ణ భార‌త ప్రాంతాల్లో భ‌ర్తీ చేయ‌నున్నట్టు స‌మాచారం. 

కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ (CBE) విధానం ద్వారా భారత ప్రభుత్వ (GoI) మంత్రిత్వ శాఖలు/విభాగాలు/సంస్థల పోస్టులను భర్తీ చేయడానికి ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు. తెలంగాణలో మూడు, ఆంధ్రప్రదేశ్‌లో 11, పుదుచ్చేరిలో ఒకటి, తమిళనాడులో ఎనిమిది కేంద్రాలతో సహా మూడు రాష్ట్రాల్లోని 22 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతాయ‌ని నోటిఫికేష‌న్ లో వెల్ల‌డించారు. చెన్నైలోని ఎస్ఎస్సీ (సదరన్ రీజియన్)కు సంబంధించి 455 ఖాళీలతో 58 కేటగిరీల పోస్టులకు ఫిబ్రవరి 24న 'ఫేజ్ 11/2023/సెలక్షన్ పోస్టులు' నోటిఫికేషన్ విడుదల చేసింది. 

ఇందులో 22 గ్రాడ్యుయేట్ స్థాయి, 19 హయ్యర్ సెకండరీ స్థాయి, 17 మెట్రిక్ స్థాయి పోస్టులు ఉన్నాయి. వెబ్ సైట్ లో ఆన్లైన్లో దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు తమ అర్హత ప్రమాణాలను సరిచూసుకోవాలని అధికారులు తెలిపారు. ప్రామాణిక రుసుముతో సహా ఆన్లైన్ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ మార్చి 27గా ప్ర‌క‌టించారు. 

అభ్య‌ర్థులు ssc.nic.in ద్వారా ఆన్లైన్ లో దరఖాస్తులు సమర్పించాలి. ఆన్లైన్ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ మార్చి 27, ఫీజును మార్చి 28లోగా ఆన్లైన్ లో చెల్లించాలి. ఆన్లైన్ దరఖాస్తు ఫారంలో, అభ్యర్థులు స్కాన్ చేసిన కలర్ పాస్ పోర్టు సైజ్ ఫోటోను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇది పరీక్ష నోటీసు వెలువడిన తేదీ నుండి మూడు నెలలకు మించకూడదని నోటిఫికేష‌న్ లో పేర్కొన్నారు. టోపీలు లేదా కళ్లజోడు లేకుండా ఫోటో ఉండాలి. ముఖం ముందు దృశ్యం స్పష్టంగా కనిపించేలా ఉండాలి. మ‌రిన్ని వివ‌రాల‌కు ssc.nic.in వెబ్ సైన్ ను సంద‌ర్శించాల‌ని సంబంధిత అధికారులు తెలిపారు.

click me!