గుజరాత్‌లో హెచ్3ఎన్2‌తో తొలి మరణం.. దేశంలో 500లకు చేరువలో కేసులు

Published : Mar 14, 2023, 02:27 PM IST
గుజరాత్‌లో హెచ్3ఎన్2‌తో తొలి మరణం.. దేశంలో 500లకు చేరువలో కేసులు

సారాంశం

గుజరాత్‌లో తొలి హెచ్3ఎన్2 మరణం సంభవించింది. దేశంలో తొలి మరణం కర్ణాటకలో రిపోర్ట్ అయిన సంగతి తెలిసిందే. దీంతో దేశంలోని మొత్తం హెచ్‌3ఎన్2 మరణాల సంఖ్య ఏడుకు చేరింది.  

అహ్మదాబాద్: హెచ్3ఎన్2 ఇన్‌ఫ్లుయెంజా వైరస్ పంజా విసురుతూనే ఉన్నది. గుజరాత్‌లోనూ ఈ వైరస్‌తో తొలి మరణం రిపోర్ట్ అయింది. దీంతో దేశంలో మొత్తం హెచ్3ఎన్2 వైరస్ మరణాల సంఖ్య ఏడుకు చేరింది. 

హెచ్3ఎన్2 ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌ బారిన పడిన ఓ మహిళ వడోదరలోని ఎస్ఎస్‌జీ హాస్పిటల్‌లో చేరారు. అదే హాస్పిటల్‌లో ఆమె చికిత్స పొందుతూ పరిస్థితులు విషమించి మరణించింది. 

మన దేశంలో హెచ్3ఎన్2 వైరస్‌ ద్వారా తొలి మరణం కర్ణాటకలో చోటుచేసుకుంది. హాసన్ జిల్లాకు చెందిన 82 ఏళ్ల వ్యక్తి ఈ వైరస్‌తో మరణించారు. ఇదిలా ఉండగా హెచ్3ఎన్2 వైరస్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. జనవరి 2వ తేదీ నుంచి మార్చి 5వ తేదీ వరకు మన దేశంలో 451 హెచ్3ఎన్2 వైరస్ కేసులు నమోదైనట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం వెల్లడించింది.

ఈ పరిస్థితులను దగ్గరగా పరిశీలిస్తున్నామని ప్రభుత్వం తెలిపింది. అయితే, ఈ నెలాఖరులో కేసుల సంఖ్య తగ్గిపోతాయని అంచనా వేసింది. 

Also Read: మైనర్ బాలికను 34 సార్లు కత్తితో పొడిచి చంపిన వ్యక్తికి మరణ శిక్ష.. ‘అరుదుల్లోకెల్లా అరుదైన కేసు’

ప్రజలు సొంత మెడికేషన్ తీసుకోరాదని, ముఖ్యంగా యాంటీబయాటిక్స్ ఇష్టారీతిన తీసుకోవద్దని ఐసీఎంఆర్ ఈ సందర్భంగా సూచించింది. హెచ్3ఎన్2 ఇన్‌ఫ్లుయెంజా వైరస్ నాన్ హ్యూమన్ ఇన్‌ఫ్లుయెంజా అని యూఎస్‌ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇది సాధారణంగా పందుల్లో వ్యాప్తి చెందుతుందని వివరించింది.

PREV
click me!

Recommended Stories

వీడు మామూలోడు కాదు.. ఫిట్ నెస్ కా బాప్ బాబా రాందేవ్ నే చిత్తుచేసిన తోపు..! (Viral Video)
IRCTC New Rates: టికెట్ ధరలు పెంచిన రైల్వే.. హైదరాబాద్ నుంచి వైజాగ్, తిరుపతికి రేట్లు ఇవే !