
భారత పార్లమెంటును, ప్రజాస్వామ్యాన్ని అవమానించినందుకు క్షమాపణ చెప్పాలని రాహుల్ గాంధీపై పార్లమెంటులో బీజేపీ ఒత్తిడి చేస్తుండటంతో కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌధురి కేంద్రంపై విరుచుకుపడ్డారు. పార్లమెంటును నడపడం ప్రభుత్వానికి ఇష్టం లేదని, అధికారంలో ఉన్న పార్టీ సభ్యులందరూ పార్లమెంటును స్తంభింపజేయడానికి గందరగోళం సృష్టించడం ఎప్పుడైనా చూశారా అని చౌదరి ప్రశ్నించారు. రాహుల్ గాంధీ ఎందుకు క్షమాపణ చెప్పాలని చౌధురి ప్రశ్నించారు. దానికి బదులు కేంద్ర ప్రభుత్వమే క్షమాపణలు చెప్పాలని ఆయన వార్తా సంస్థ ‘ఏఎన్ఐ’తో అన్నారు.
రైళ్లో టీటీఈ అఘాయిత్యం.. మద్యం మత్తులో మహిళా ప్రయాణికురాలిపై మూత్రవిసర్జన..
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల రెండో దశ సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. అయితే యూకేలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై సభలో మంగళవారం కూడా గందరగోళం నెలకొంది. దీనిపై రెండు వైపులా (బీజేపీ, కాంగ్రెస్) పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని అధికార పక్షం ఎంపీలు, ప్రభుత్వం క్షమాపణ చెప్పాలంటూ విపక్ష సభ్యులు ఆందోళనకు దిగడంతో రాజ్యసభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది.
ఇదిలావుండగా.. రాహుల్ గాంధీ పార్లమెంటును అవమానించారని సభా నాయకుడు, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సోమవారం ఆరోపించారు. అయితే ఆయన పేరును ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. తాను చాలా తీవ్రమైన అంశాన్ని లేవనెత్తానని గోయల్ తెలిపారు. కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు విదేశాలకు వెళ్లారని, అక్కడ భారత్ లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, భారత్ అంతర్గత వ్యవహారాల్లో, ప్రజాస్వామ్యంలో ఐరోపా దేశాలు, అమెరికా జోక్యం చేసుకోవాలని కోరారని చెప్పారు. అలాంటి వ్యక్తిని సభలో విమర్శించాలని అన్నారు.
దేవుడికి మాంసం దండ.. ఇద్దరు అరెస్టు.. షాకింగ్ కలిగిస్తున్న విషయాలు
ఇటీవల లండన్ లో బ్రిటీష్ పార్లమెంటేరియన్లను ఉద్దేశించి రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ.. పార్లమెంటులో ప్రతిపక్ష నేతల మైక్ లు తరచూ నిశ్శబ్దంగా ఉంటున్నాయని ఆరోపించారు. ప్రధాని మోడీపై, ప్రజాస్వామ్యంపై, చైనా సమస్యతో పాటు ఇంకా అనేక ఆరోపణలు చేశారు. పార్లమెంటులో ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని కేంబ్రిడ్జిలో అంతకు ముందు ఆయన ఆరోపించారు.