కేంద్ర ప్రభుత్వం రైతులకు కొత్త సంవత్సరంలో గుడ్ న్యూస్ చెప్పింది. పీఎం కిసాన్ నిధి డబ్బులను రైతులు అకౌంట్ లో జమ చేసింది. ఈ పథకం కింద దేశంలోని 10 కోట్ల మంది రైతులకు లబ్ది చేకూరిందని పీఎంవో ప్రకటనలో తెలిపింది.
కేంద్ర ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. కేంద్ర ప్రభుత్వం రైతులకు పంట పెట్టుబడి సాయం కింద అందించే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులను ఈరోజు విడుదల చేసింది. పట్టాదారు పాస్ బుక్ ఉన్న రైతులకు ఏడాదికి ఆరు వేల చొప్పున కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. ఇది ఏడాదిలో మూడు విడుతలుగా రైతుల బ్యాంక్ అకౌంట్ లో జమ అవుతుంది. 2019 ఫిబ్రవరిలో ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటి వరకు 9 సార్లు రైతులకు పెట్టుబడి సాయం అందజేసింది. అయితే శనివారం రోజు పదో విడత పీఎం కిసాన్ నిధులను ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ విడుదల చేశారు.
కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధర తగ్గించిన కేంద్ర ప్రభుత్వం
undefined
10 కోట్ల మంది రైతులకు లబ్ది..
పీఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకం ద్వారా దేశంలో ఉన్న పది కోట్ల మంది రైతులకు లబ్ది చేకూరుతోంది. ఈ పదో విడత కిసాన్ సమ్మాన్ నిధుల కింద రూ.20,000 కోట్ల రూపాయిలను రైతుల బ్యాంక్ అకౌంట్లలోకి బదిలీ చేశారు.ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం శనివారం ప్రకటన విడుదల చేసింది. ఈ పథకం ద్వారా అట్టడుగు స్థాయి రైతులకు సాధికారత కల్లుతుందని తెలిపింది. ఇది ప్రభుత్వ నిబద్ధతకు, సంకల్పానికి నిదర్శనమని తెలిపింది. ఈ పథకం ద్వారా 2019 నుంచి ఇప్పటి వరకు రూ.1.6 లక్షల కోట్లకు పైగా నిధులు రైతుల అకౌంట్లలో నేరుగా బదిలీ అయ్యాయి.
పీఎం కిసాన్ డబ్బులు ఎలా చెక్ చేసుకోవాలంటే.. ?
ముందుగా కేంద్ర ప్రభుత్వ పీఎం కిసాన్ యోజన అధికారిక వెబ్ సైట్ pmkisan.gov.in అని సెర్చ్ చేయాలి. తరువాత హోం పేజీ వస్తుంది. ఈ హోం పేజీలో కుడి వైపున ఉన్న ఫార్మర్స్ అనే కార్నర్‌కు వెళ్లాలి. అనంతరం ఫార్మర్ ను ఎంపిక చేసుకోవాలి. తరువాత బెనిఫిషియరీ స్టేటస్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. అందులో ఐదు కాలమ్స్ వస్తాయి. అందులో రాష్ట్రం పేరు, జిల్లా పేరు, సబ్ డిస్ట్రిక్ట్, బ్లాక్, విలేజ్ నేమ్ అనే ఆప్షన్ ఉంటాయి. వాటిలో రైతుల వివరాల ఆధారంగా అన్ని సెలెక్ట్ చేయాలి. తరువాత కుడివైపున గ్రీన్ కలర్‌లో ఉండే గెట్ రిపోర్ట్స్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఇలా చేయడం వల్ల మీ గ్రామంలోని రైతుల లిస్ట్ కనిపిస్తుంది.
హర్యానాలో విరిగిపడిన కొండచరియలు.. శిథిలాల కింద చిక్కుకున్న 15 మంది!
నాలుగు రోజుల క్రితం విడుదలైన రైతుబంధు నిధులు..
తెలంగాణ ప్రభుత్వం కూడా రైతులకు మూడు నాలుగు రోజుల క్రితం రైతు బంధు నిధులను విడుదల చేసింది. ముందుగా ఒక ఎకరం ఉన్న రైతులకు 28వ తేదీ రోజు నిధులు విడుదల చేసింది. వారికి అదే రోజు బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు జమ అయ్యాయి. రెండో రోజు రెండు ఎకరాలు ఉన్న రైతులకు, మూడో రోజు మూడు ఎకరాలు ఉన్న రైతులకు ఇలా విడదల వారీగా నిధులను విడుదల చేస్తామని ప్రభుత్వం ముందుగానే ప్రకటించింది. ఈ యాసంగి సీజన్ కింద రైతు బంధు నిధులు రూ.7600 కోట్లను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది.