టోక్యో ఒలింపిక్స్‌‌: గోల్డ్ మెడల్ కొడితే.. రూ.6 కోట్లు, అథ్లెట్లకు యోగి సర్కార్ నజరానాలు

By Siva KodatiFirst Published Jul 13, 2021, 5:18 PM IST
Highlights

టోక్యో-2020 ఒలింపిక్స్‌‌లో పాల్గొంటున్న అథ్లెట్లకు యూపీ సర్కార్ భారీ నజరానా ప్రకటించింది. బంగారు పతకం సాధించేవారికి ఆరు కోట్ల రూపాయలు, వెండి పతకం సాధించేవారికి 4 కోట్ల రూపాయలు, కాంస్య పతకం సాధించేవారికి 2 కోట్ల రూపాయలు ఇస్తామని వెల్లడించింది. 
 

టోక్యో-2020 ఒలింపిక్స్‌‌లో పతకాలు సాధించే యూపీ క్రీడాకారులకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బంపరాఫర్ ప్రకటించారు. వ్యక్తిగత ఈవెంట్లలో బంగారు పతకం సాధించేవారికి ఆరు కోట్ల రూపాయలు, వెండి పతకం సాధించేవారికి 4 కోట్ల రూపాయలు, కాంస్య పతకం సాధించేవారికి 2 కోట్ల రూపాయలు ఇస్తామని యూపీ ప్రభుత్వం ప్రకటించింది.

అంతేకాదు టీం ఈవెంట్లలో గోల్డ్ మెడల్ నెగ్గేవారికి 3 కోట్లు, సిల్వర్ మెడల్ సాధించేవారికి 2 కోట్లు, బ్రాంజ్ మెడల్ సాధించిన వారికి కోటి రూపాయలు ఇవ్వనున్నారు. అలాగే టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న ప్రతి యూపీ క్రీడాకారుడికి పది లక్షల రూపాయల నజరానా ఇప్పటికే ప్రకటించారు. మెడల్స్ గెలిచినా, గెలవకున్నా ఈ నజరానా క్రీడాకారులకు అందజేస్తారు

Also Read:టోక్యో ఒలింపిక్స్‌ వెళ్లే అథ్లెట్లకు స్మార్ట్ మెడిటేషన్ రింగ్స్... ధ్యానాతో చేతులు కలిపిన ఐఓఏ...

టోక్యో ఒలింపిక్స్‌ను దృష్టిలో ఉంచుకుని యోగి సర్కారు నాలుగేళ్ల నుంచే క్రీడాకారుల కోసం 44 హాస్టళ్లు, స్టేడియాలు నిర్మించింది. పాత వాటికి మరమ్మతులు కూడా చేయించింది. 19 జిల్లాల్లో 890 మంది క్రీడాకారుల కోసం ప్రత్యేక కోచ్‌లతో శిక్షణ ఇప్పిస్తోంది. వెయ్యి కోట్ల రూపాయల ప్రత్యేక బడ్జెట్‌ను రెండున్నర వేల కోట్ల రూపాయలకు పెంచింది. కరోనాతో గతేడాది వాయిదా పడిన టోక్యో-2020 ఒలింపిక్స్‌ ఈనెల 23 నుంచి ప్రారంభంకానుంది . వచ్చేనెల 8 వరకు జరిగే ఈ మెగా ఈవెంట్‌లో 33 క్రీడాంశాల్లో 205 దేశాలకు చెందిన అథ్లెట్లు తలపడుతున్నారు. జూలై 23న భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4.25కి ప్రారంభ కార్యక్రమం మొదలు కానుంది

click me!