టోక్యో ఒలింపిక్స్ వెళ్లే అథ్లెట్లకు స్మార్ట్ మెడిటేషన్ రింగ్స్... ధ్యానాతో చేతులు కలిపిన ఐఓఏ...
టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనే అథ్లెట్లకు స్మార్ట్ ధ్యానా రింగ్స్...
అథ్లెట్స్ ప్రశాంతంగా ఉండే నిమిషాలను కూడా లెక్కించి, మెడిటేషన్ సెషన్స్‌లో ఎవరు ఎంత ఫోకస్‌గా పెట్టారో చెప్పనున్న స్మార్ట్ రింగ్స్...
ఏ ఆటలో విజయం సాధించాలంటే టెక్నిక్‌తో పాటు మానసిక ఒత్తిడిని ఎలా ఎదుర్కోవడం తెలియడం చాలా అవసరం. ఫైనల్స్‌లో మానసిక ఒత్తిడికి గురై, స్థాయికి తగిన పర్ఫామెన్స్ ఇవ్వలేకపోతారు చాలామంది అథ్లెట్లు. ఈ సమస్యను అధిగమించేందుకు ఉన్న మెరుగైన మార్గాల్లో ఒకటి మెడిటేషన్ (ధ్యానం).
ఒలింపిక్స్‌కి వెళ్లే అథ్లెట్లకు స్మార్ట్ మెడిటేషన్ పాఠాలు నేర్పించేందుకు ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్ (ఐఓఏ), స్టార్టప్ కంపెనీ ‘ధ్యానా’తో చేతులు కలిపింది.
టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనే అథ్లెట్లకు స్మార్ట్ ధ్యానా రింగ్స్, ధ్యానా హెల్త్ మెనేజ్‌మెంట్ సర్వీసులను అందించనుందీ సంస్థ. కరోనా ప్రోటోకాల్‌తో పాటు టోక్యోలో ఎమర్జెన్సీ విధించడంతో ఒలింపిక్స్‌కి వెళ్లే అథ్లెట్లు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ఎలాంటి అవాంతరాలు, ఇబ్బందులు ఎదురైనా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఉండేందుకు ఈ ధ్యానా స్మార్ట్ ప్రోగ్రామ్స్ ఉపయోగపడతాయని ఐఓఏ భావిస్తోంది. ఈ ప్రోగ్రామ్‌ను భారత బ్యాడ్మింటన్ లెజెండ్, జాతీయ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సటీ సభ్యులు, బయో మెడికల్ టెక్నాలజీ ఎంట్రపెన్యూర్ భైరవ్ శంకర్ కలిసి రూపొందించారు.
ఈ స్మార్ట్ ధ్యానా రింగ్స్, అథ్లెట్స్ ధ్యానంలో ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉండే నిమిషాలను కూడా లెక్కించి చెబుతాయి. అంతేకాదు మెడిటేషన్ సెషన్స్‌లో ఎవరు ఎంత ఫోకస్‌గా ఉన్నారో గుణించి మరీ చెబుతాయి. ఇప్పటికే వీటిని తన అకాడమీలో ఉపయోగించిన పుల్లెల గోపిచంద్, మంచి ఫలితాలను రాబట్టాడు.
‘ధ్యానా వల్ల అథ్లెట్లు ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడిని సాంకేతిక పద్ధతిలో గుర్తించి, దాన్ని తగ్గించేందుకు పరిష్కార మార్గాలను కనుగొనవచ్చు. ఇది క్రీడాకారుల ఫోకస్‌ను పెంచి, ధ్యానం వల్ల లభించే పాజిటివ్ స్టేట్ ఆఫ్ మైండ్‌ను అందిస్తుంది...’ అంటూ తెలిపాడు ధ్యానా ఎండీ భైరవ్ శంకర్...