కమల్ నాథ్ సమక్షంలో.. కాంగ్రెస్ పార్టీలో చేరిన గాడ్సే మద్దతుదారుడు... !!

By AN TeluguFirst Published Feb 25, 2021, 4:58 PM IST
Highlights

కాంగ్రెస్ పార్టీ అంటే గాంధీ పార్టీ. ఇప్పటివరకు ఆ ఇంటిపేరున్న వాళ్లదే అధికారం, పాలన. అయితే ఈ పార్టీలో గాంధీజీని చంపిన గాడ్సే సానుభూతి పరుడు చేరడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో జరిగింది. 

కాంగ్రెస్ పార్టీ అంటే గాంధీ పార్టీ. ఇప్పటివరకు ఆ ఇంటిపేరున్న వాళ్లదే అధికారం, పాలన. అయితే ఈ పార్టీలో గాంధీజీని చంపిన గాడ్సే సానుభూతి పరుడు చేరడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో జరిగింది. 

మధ్యప్రదేశ్‌లోని అఖిల భారతీయ హిందూ మహాసభకు బాబులాల్ చౌరాసియా అనే వ్యక్తి గురువారం మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. హిందూ మహాసభపై, గాడ్సే పై ఒంటి కాలిమీద లేచే కాంగ్రెస్ నేతలే స్వయంగా బాబూలాల్ కు పుష్ఫగుచ్చం ఇచ్చి సాధరంగా పార్టీలోకి ఆహ్వానించారు. 

అయితే బాబూలాల్ కాంగ్రెస్ లో చేరగానే అతను గతంలో పాల్గొన్నకార్యక్రమాలపై అనేక అభ్యంతరాలు వస్తున్నాయి.  2017 నవంబర్ 15న గాడ్సే విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొనడం మీద బాబూలాల్ వివరణ ఇచ్చారు. 

నిజానికి తాను బలవంతంగా ఆ కార్యక్రమంలో పాల్గొనాల్సి వచ్చిందని, తనమీద జరిగిన కుట్ర వల్ల తాను అక్కడ ఉండాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. అయితే ఈ సమావేశంలో గాడ్సే నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని బాబూలాల్ పేర్కొన్నారు. 

అంతే కాకుండా 2018 డిసెంబర్ 11న జరిగిన మరో కార్యక్రమంలో కూడా బాబూలాల్ పాల్గొన్నారు. దీనిమీద బాబూలాల్ వివరణ ఇస్తూ... ‘హిందూ మహాసభ నామీద కుట్ర పన్ని నన్ను ఆ కార్యక్రమంలో ఉండేలా చేసింది. గాడ్సే విగ్రహంపై నీళ్లు పోసి నివాళి అర్పించమని కొందరు నాకు సైగ చేశారు. కానీ మాజీ కాంగ్రెస్ నేతనైన నేను గాడ్సేకు ఎలా మద్ధతుగా ఉండగలను? అక్కడే గట్టి నిరసన వ్యక్తం చేశాను’ అన్నారు.

click me!