గుడ్‌న్యూస్: 9 నుండి 11 తరగతులకు నో ఎగ్జామ్స్, పై తరగతులకు ప్రమోట్

Published : Feb 25, 2021, 02:59 PM IST
గుడ్‌న్యూస్: 9 నుండి 11 తరగతులకు నో ఎగ్జామ్స్, పై తరగతులకు ప్రమోట్

సారాంశం

తమిళనాడు విద్యార్ధులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 9 నుండి 11 తరగతుల విద్యార్ధులను ఎలాంటి పరీక్షలు లేకుండానే ప్రమోట్ చేయనున్నట్టుగా ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.


చెన్నై:తమిళనాడు విద్యార్ధులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 9 నుండి 11 తరగతుల విద్యార్ధులను ఎలాంటి పరీక్షలు లేకుండానే ప్రమోట్ చేయనున్నట్టుగా ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొంది. 9, 10., 11 తరగతుల విద్యార్ధులకు ఎలాంటి పరీక్షలు లేకుండా పై తరగతులకు ప్రమోట్ చేయనున్నట్టుగా ఆ రాష్ట్ర సీఎం  పళని స్వామి ప్రకటించారు.

ఈ విషయమై రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి ఇవాళ ఈ మేరకు ప్రకటన చేశారు. సీఎం ప్రకటనకు అనుగుణంగా అధికారులు రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు ఆదేశాలు జారీ చేయనున్నారు.12వ తరగతి విద్యార్ధులకు రాష్ట్ర ప్రభుత్వం ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారంగా పరీక్షలు  నిర్వహించనున్నారు. ఈ ఏడాది మే 3వ తేదీ నుండి మే 21 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.

గత ఏడాది కూడ పరీక్షలు నిర్వహించకుండానే విద్యార్ధులను పై తరగతులకు ప్రమోట్ చేశారు. కరోనా నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొన్న విషయం తెలిసిందే.

 

PREV
click me!

Recommended Stories

ఇక ఓటర్లు BLOల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదు.. SIRపై ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
పై నుంచి చూస్తే ఇడ్లీ, రాగి పిండి క‌వ‌ర్లు.. ఓపెన్ చేసి చూడ‌గా అధికారుల‌ ఫ్యూజులు అవుట్