
ఎవరు, ఎప్పుడు, ఎలా చనిపోతారనేది మన చేతుల్లో ఉండదు. చావాలనుకున్నా ఆయుష్షు ఉంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రాణం పోదు. అయితే అనుకోకుండా చావు కబలిస్తే మాత్రం అది తీరని వేదనగా మారుతుంది. అలాంటి ఓ ఘటనే కేరళలో జరిగింది.
ఆత్మహత్య చేసుకుందామని ప్రయత్నించిన మహిళ బతికి, అభం శుభం ఎరుగని ఐదేళ్ల చిన్నారి, ఎంతో భవిష్యత్ ఉన్న 19 యేళ్ల చెల్లి అనుకోకండా మరణించారు. దీంతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్న మహిళ కటకటాలపాలైంది.
వివరాల్లోకి వెడితే... కేరళకు చెందిన ఓ మహిళ ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. ఎలుకల మందు తాగి చనిపోవాలని నిర్ణయించుకుంది. దీంతో ఎలుకల మందు తెచ్చుకొని ఐస్‌క్రీమ్‌లో కలుపుకుని తాగింది. అయితే ఆ ఐస్ క్రీం పూర్తిగా తినలేదు. అది పడేయడం మర్చిపోయింది.
అయితే ఆ ఐస్ క్రీంలో విషం ఉన్న సంగతి తెలియని ఆ మహిళ ఐదేళ్ల కుమారుడు, ఆమె 19యేళ్ల సోదరి ఐస్ క్రీం తినేశారు. అయితే ఈ విషంతో వీళ్లిద్దరూ చనిపోయారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆత్మహత్య చేసుకోవాలని విషం కలుపుకున్న యువతి మత్రం బతికింది.
విషయం తెలిసి లబోదిబో మన్నది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోవడంతో ఆ మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.