
గోవా : ప్రేమలో పడడం.. ఏదో ఒక కారణంతో విడిపోవడం.. ఈ మధ్య కాలంలో ఎక్కువైపోయింది. ఇక Breakup చెప్పిందని ప్రియురాలి పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం కూడా అక్కడక్కడ చూస్తూనే ఉన్నాం… తనను కాదని వెళ్లిపోయిందని బాధ, కోపం తట్టుకోలేక కొందరు ప్రాణాలు తీస్తున్నారు. ప్రేమలో పడితే లోకాన్ని మరచి పోయే జంటలు.. అదే love వద్దని చెబితే ఏకంగా ఈ లోకంలోనే లేకుండా చేస్తున్నారు. తాజాగా తనకు బ్రేకప్ చెప్పిందని loverని కిరాతకంగా హత్య చేశాడు ఓ యువకుడు. ఈ ఘటన goaలో చోటుచేసుకుంది.
కిషన్ కలంట్కర్ (26) అనే యువకుడు కాలేజీలో చదువుతున్న 19 ఏళ్ల యువతిని ప్రేమించాడు. కొన్నాళ్లపాటు వీరి లవ్ ట్రాక్ బాగానే సాగింది. అయితే మనస్పర్థల కారణంగా రిలేషన్షిప్ కొనసాగించడం ఇష్టం లేదని, విడిపోదామని యువతి చెప్పింది. దీంతో యువకుడు మనస్థాపానికి గురయ్యాడు. బ్రేకప్ ను తట్టుకోలేక యువతితో కలిసి బుధవారం సౌత్ గోవాలోని నేపాల్ బీచ్ కి వెళ్ళాడు. అక్కడ కూడా తనను విడిచి వెళ్లొద్దని ప్రాధేయపడ్డాడు. ఎంతసేపటికి యువతీ ఒప్పుకోకపోవడంతో కోపోద్రిక్తుడైన అతడు అప్పటికే తన వెంట తెచ్చుకున్న కత్తితో యువతిని పొడిచి చంపాడు.
యువతి చనిపోవడంతో మృతదేహాన్ని బీచ్ పక్కనే ఉన్న పొదలో పడేసి అక్కడి నుంచి పరారయ్యాడు. సమీపంలోని ఓ యువతి మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటన జరిగిన 24 గంటల్లోనే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇదిలా ఉండగా, ప్రేమించిన యువతి సెక్స్ కు నిరాకరించిందని చంపేసిన ఘటన మార్చి లో జరిగింది. ప్రేమిస్తే చాలు మహిళలు ఏం చెబితే అది చేయాలని కోరుకుంటారు. దానికి నిరాకరిస్తే దారుణానికి తెగబడతారు. ఇలాంటి మృగాళ్లు అక్కడక్కడా కనిపిస్తూనే ఉన్నారు. ఓ వ్యక్తి ఓ మహిళను ఐదేళ్లుగా ప్రేమించాడు. ప్రేమించాను కదా అని శారీరక సంబంధానికి బలవంతం చేశాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో దారుణానికి తెగబడ్డాడు.
sexకి నిరాకరించిందనే కోపంతో ప్రియురాలిని knifeతో పొడిచి చంపిన ప్రియుడు బాగోతం tamilnadu రాష్ట్రంలోని చెన్నై నగరంలో వెలుగుచూసింది. చెన్నైలోని కుండత్తూర్ ప్రాంతానికి చెందిన రాజా(38) అనే వ్యక్తి అదే ప్రాంతానికి చెందిన ఓ womanను గత ఐదేళ్లుగా ప్రేమిస్తున్నాడు. మహిళ అద్దె ఇంట్లో ఉంటూ ఓ ప్రైవేట్ కంపెనీలో కూలీగా పని చేస్తుండేది. శనివారం రాత్రి పీకల దాకా liquor తాగిన రాజా ప్రియురాలి ఇంటికి వెళ్లి తనతో పడుకోమని బలవంతం చేశాడు. దీనికి ఆమె ఒప్పుకోలేదు.
దీంతో వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ప్రియుడు, ప్రియురాలు గొడవ పడుతుండడంతో... ఇరుగుపొరుగు వారు వచ్చి రాజాను ఇంటి నుంచి పంపించి వేశారు. అందరూ అక్కడినుంచి వెళ్లిపోయి.. నిద్రపోయాక తిరిగివచ్చిన రాజా.. ప్రియురాలిని బంధించి కత్తితో పొడిచి పారిపోయాడు. రక్తపు మరకలతో ఉన్న షర్టు ధరించిన రాజా కుండ్రత్తూర్ వద్ద కూర్చుని ఉండగా గస్తీ పోలీసులు పట్టుకుని ప్రశ్నించారు. దీంతో హత్య విషయం వెలుగుచూసింది. తన ప్రియురాలిని హత్య చేసినట్లు రాజా అంగీకరించడంతో అతన్ని అరెస్టు చేసి జ్యుడిషియల్ కస్టడీకి పంపించారు.