Coronavirus: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఒమిక్రాన్ విజృంభణ కారణంగా అన్ని దేశాల్లో కలిపి కరోనా వైరప్ కేసులు 300 మిలియన్ మార్కును దాటాయి. 5.6 మిలియన్ల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. పలు దేశాల్లో పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి.
Coronavirus: కరోనా మహమ్మారి కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విజృంభణ కొనసాగుతున్నది. దీని కారణంగా ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. కోవిడ్-19 కారణంగా ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య కూడా అధికమవుతున్నది. చాలా దేశాల్లో నిత్యం లక్షల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. దాని కారణంగా ప్రపంచవ్యాప్తంగా కరోనా బారినపడ్డ వారి సంఖ్య 300 మిలియన్ల మార్కును దాటింది. అలాగే, మరణాలు 5.6 మిలియన్లకు పైగా చేరాయి.
ప్రస్తుత కరోనా వైరస్ వివరాలు ఇలా ఉన్నాయి..
undefined
1. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 326,961,733 మంది కరోనా (Coronavirus) మహమ్మారి బారినపడ్డారు. అలాగే, కోవిడ్-19తో పోరాడుతూ.. 5,554,781 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా వైరస్ బారినపడ్డవారిలో 266,545,061 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. నిత్యం 30 లక్షలకు పైగా కరోనా కొత్త కేసులు నమోదవుతున్నాయి.
2. కరోనావైరస్ కేసులు (Coronavirus) అధికంగా నమోదవుతున్న దేశాల్లో అమెరికా, భారత్, బ్రెజిల్, యూకే, ఫ్రాన్స్, రష్యా, టర్కీ, ఇటలీ, స్పెయిన్, జర్మనీలు టాప్‌లో ఉన్నాయి.
3. దక్షిణాఫ్రికాలో మొదట కనుగొనబడిన, వేగంగా వ్యాప్తి చెందుతున్న ఓమిక్రాన్ వేరియంట్‌కు వ్యతిరేకంగా దేశాలు తమ పోరాటాన్ని కొనసాగించినప్పటికీ, శాస్త్రవేత్తలు ప్రస్తుత దాని తర్వాత మరింత ఆందోళన కలిగించే (Coronavirus) రకాలు పుట్టుకువచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంటున్నారు.
4. కరోనా (Coronavirus) కేసులు మొదట వెలుగుచూసిన చైనాలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి. చైనా రాజధాని బీజింగ్, వింటర్ ఒలింపిక్స్‌కు కొన్ని వారాల ముందు ఒమిక్రాన్ వేరియంట్ కేసు వెలుగులోకి రావడంపై ఆ దేశం ఆందోళన వ్యక్తం చేస్తున్నది.
5. గత ఐదు రోజుల్లో మొదటిసారిగా ఆస్ట్రేలియాలో కోవిడ్-19 కేసుల రోజువారీ సంఖ్య 100,000 కంటే తక్కువకు పడిపోయింది. కొత్తగా 85,824 కేసులు నమోదయ్యాయి. ఓమిక్రాన్ వేరియంట్ విజృంభణ కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలోనే పౌరులు కోవిడ్-19 (Coronavirus) కి వ్యతిరేకంగా వ్యాక్సిన్ తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
6. యునైటెడ్ స్టేట్స్‌లో, గత శీతాకాలపు (Coronavirus) గరిష్ట స్థాయి నుండి ఆస్పత్రిలో చేరిన వారి సంఖ్య దేశవ్యాప్తంగా ఓమిక్రాన్ పెరగడంతో కొత్త రికార్డులు సృష్టిస్తున్నదని అధికారులు పేర్కొంటున్నారు. US డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ డెటా ప్రకారం అమెరికాలో Coronavirus తో ఆస్పత్రిలో చేరిన వారి సంఖ్య ఆదివారం నాటికి 142,388కి చేరుకుంది. కొత్త కేసుల సైతం పెరుగుతూనే ఉన్నాయి.
7. గత నవంబర్‌లో ఓమిక్రాన్ కనుగొనబడిన దక్షిణాఫ్రికాలో.. ఆర్థిక వ్యవస్థ, జీవనోపాధి, సమాజంలోని ఇతర అంశాలపై పరిమితులు పరోక్షంగా హానికరమైన ప్రభావాలను కలిగిస్తాయని వైద్య నిపుణులతో సూచించడంతో లాక్‌డౌన్ విషయంపై చర్యలు తీసుకోవడానికి ఆ దేశం సిద్ధమవుతున్నది.
8. పాకిస్థాన్‌లో వరుసగా నాల్గవ రోజు 4,000 కంటే ఎక్కువ కోవిడ్ -19 కేసులను నమోదయ్యాయి. దీంతో కరోనా కేసులు 1.3 మిలియన్లకు పైగా పెరిగాయి. పాకిస్థాన్ లో శనివారం నాటి 4,286 కేసుల సంఖ్య గత ఏడాది ఆగస్టు నుండి ఇప్పటివరకు ఇదే అత్యధికం.
9. భారత్ లో కొత్తగా 2,71,202 కరోనా కేసులు (Corona cases) నమోదయ్యాయి. అలాగే, 314 మంది మరణించారు. దీంతో మొత్తం కేసులు 3,71,22,164కు చేరగా, Coronavirus మరణాలు 4,86,066కు పెరిగాయి.
10. రష్యా, మెక్సికో దేశల్లో నూ కరోనా కొత్త కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఈ దేశాల్లో నిత్యం 3 లక్షలకు పైగా కొత్త కేసులు (Coronavirus) నమోదవుతున్నాయి. పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతుండటంపై ఆందోళన వ్యక్తమవుతున్నది.