up assembly election 2022 : సమాజ్ వాదీ పార్టీలో చేరిన మరో యూపీ మాజీ మంత్రి దారా సింగ్ చౌహాన్..

By team teluguFirst Published Jan 16, 2022, 3:20 PM IST
Highlights

ఉత్తరప్రదేశ్ లో బీజేపీకి  రాజీనామా చేసిన మరో మంత్రి దారా సింగ్ చౌహ‌న్ సమాజ్ వాదీ పార్టీలో ఆదివారం చేరారు. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో అధికార పార్టీని నుంచి ప్రతిపక్ష పార్టీలోకి జంప్ అయిన మూడో మంత్రిగా చౌహాన్ నిలిచారు. 

ఉత్తరప్రదేశ్ (uthara pradhesh) రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. రోజుకో ర‌కంగా మలుపులు తిరుగుతున్నాయి. యూపీలో అధికార బీజేపీ (bjp) నుంచి ఇటీవ‌ల రాజీనామా చేసిన దారా సింగ్ చౌహ‌న్ (dara singh chouhan) నేడు స‌మాజ్ వాదీ పార్టీలో చేరారు. యోగి ఆధిత్య‌నాథ్ (yogi adhityanadh) నేతృత్వంలో మంత్రిగా ప‌ని చేసి స‌రిగ్గా ఎన్నిక‌ల‌కు ముందు అఖిలేష్ యాదవ్ (akhilesh yadav) ఆధ్వ‌ర్యంలోని ప్ర‌తిప‌క్ష ఎస్పీలో చేరిన మూడో మంత్రిగా దారా సింగ్ చౌహ‌న్ నిలిచారు. 

దారా సింగ్ చౌహ‌న్ ఉత్త‌ర‌ప్ర‌దేశ‌ల్ లోని మౌ జిల్లాలోని మ‌ధుబ‌న్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి బీజేపీ త‌రుఫున ఎమ్మెల్యేగా కొన‌సాగుతున్నారు. సీఎం యోగి ఆదిత్య‌నాథ్ ఆధ్వ‌ర్యంలో అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ‌కు మంత్రిగా వ్య‌వహ‌రించారు. ఆయ‌న ఇటీవ‌లే బీజేపీకి, మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేశారు. అయితే ఏ పార్టీలో చేర‌బోయే విష‌యంపై మాత్రం ఆయ‌న క్లారిటీ ఇవ్వ‌లేదు. అయితే ఆదివారం అఖిలేష్ యాద‌వ్ స‌మక్షంలో స‌మాజ్ వాదీ పార్టీ (samajwadi party)  కండువా క‌ప్పుకొని, ఆ పార్టీలో చేరారు. 

స‌మాజ్ వాదీ పార్టీలో చేరిక సంద‌ర్భంగా అఖిలేష్ యాద‌వ్ బీజేపీని ఉద్దేశించి మాట్లాడారు. కాలంతో పాటు ప్రతీ దానిని ప్రైవేటీకరించడం బీజేపీ వ్యూహ‌మ‌ని వెనుకబడిన తరగతులు, దళితులు అర్థం చేసుకున్నార‌ని అన్నారు. డాక్ట‌ర్ బీ ఆర్ అంబేద్క‌ర్ రూపొందించిన రాజ్యాంగాన్నిప్రమాదంలో పడేసి, రిజ‌ర్వేష‌న్ వ్య‌వ‌స్థ‌ను ఎవ‌రూ ముగించ‌లేర‌ని తెలిపారు. ఈ బీజేపీ సీఎం కంటే ఎక్కువ‌గా ఎవ‌రూ అబ‌ద్ధం చెప్ప‌లేర‌ని యోగి ఆదిత్య‌నాథ్ ను ఉద్దేశించి అన్నారు. ఇక నుంచి బీజేపీకి చెందిన ఎక్కువ మంది ఎమ్మెల్యేలు, మంత్రుల‌ను త‌మ పార్టీలో చేర్చుకోబోమ‌ని అఖిలేష్ యాద‌వ్ స్పష్టం చేశారు. 

ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న కొద్దీ యూపీలో బీజేపీకి ఎదురుదెబ్బ‌లు త‌గులుతున్నాయి. ఇటీవ‌లే ఇద్దరు మంత్రులు స్వామి ప్ర‌సాద్ మౌర్య‌ (swamy prasadh mourya), ధ‌ర‌మ్ సింగ్ సైనీ (dharam singh sainy) పార్టీకి, ప‌ద‌వుల‌కు రాజీనామా చేసి స‌మాజ్ వాదీ పార్టీలో చేరారు. వీరితో పాటు బీజేపీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు కూడా ఎస్పీలో చేరారు. ఇందులో షోహ్రత్‌గఢ్ నుంచి ప్రాతినిథ్యం వ‌హిస్తున్నఅప్నా దళ్ (సోనేలాల్) నాయకుడు అమర్ సింగ్ చౌదరి కూడా ఉన్నారు. అలాగే కాన్పూర్ లోని బిల్హౌర్ ఎమ్మెల్యే భగవతీ సాగర్, ఔరయ్యాలోని బిధునాకు చెందిన నాయ‌కులు రోషన్‌లాల్ వర్మ, వినయ్ షాక్యా, బహ్రైచ్‌లోని తింద్వారి కి చెందిన నాయ‌కుడు బ్రిజేష్ ప్రజాపతి, ఫిరోజాబాద్‌లోని షికోహాబాద్ కు చెందిన ముఖేష్ వర్మ ఉన్నారు. 

యూపీలో మొత్తం 403 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. బీజేపీ అధికార పార్టీగా యోగీ ఆదిత్య‌నాథ్ సీఎంగా కొన‌సాగుతున్నారు. ప్ర‌తిప‌క్ష పార్టీగా స‌మాజ్ వాదీ వ్య‌వ‌హ‌రిస్తోంది. ఇటీవ‌ల కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ ప్ర‌క‌టించిన ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల షెడ్యుల్ (election schedule) లో భాగంగా యూపీలో కూడా ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. దేశంలోనే అత్య‌ధిక అసెంబ్లీ స్థానాలు ఉన్నయూపీలో ఫిబ్ర‌వ‌రి 10వ తేదీ నుంచి ఎన్నిక‌లు ప్రారంభ‌మ‌వుతాయి. మొత్తం ఏడుద‌శల్లో ఈ ఎన్నిక‌లు జ‌రుగుతాయి. మార్చి 10వ తేదీన ఓట్లు లెక్కింపు చేపట్టి ఫ‌లితాలు ప్ర‌క‌టించ‌నున్నారు. 
 

click me!