
ఆరు మత వర్గాల ప్రజలకు మైనారిటీ సర్టిఫికెట్లు అందించాలని అస్సాం ప్రభుత్వం నిర్ణయించింది. అయితే దీనికి సంబంధించిన ప్రకటన వెలువడిన ఒక రోజు తర్వాత ప్రభుత్వానికి కొంత ఎదురుదెబ్బ తగిలింది. ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (AIUDF), కాంగ్రెస్ పార్టీలు ప్రభుత్వ తీరును విమర్శించాయి. AIDUF దీనిని డివైడ్ అండ్ రూల్ పాలసీ (విభజించు, పాలించు విధానం) అని పేర్కొంది.AIDUF ఎమ్మెల్యే, పార్టీ ప్రధాన కార్యదర్శి అమీనుల్ ఇస్లాం మాట్లాడుతూ.. రాజ్యాంగం ఇప్పటికే వర్గాలకు మైనారిటీ హోదా కల్పించినందున రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ప్రత్యేక గుర్తింపు అవసరం లేదని నొక్కి చెప్పారు.
Assembly bypolls : నేడు మూడు రాష్ట్రాల్లో పలు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు.. ఎక్కడెక్కడంటే ?
‘‘ భారత రాజ్యాంగం ఇప్పటికే వర్గాలకు మైనారిటీ హోదా ఇచ్చింది. మీరు ఈ మతాల ప్రజలకు ప్రయోజనాలు ఇవ్వాలనుకుంటే ఇవ్వొచ్చు. కానీ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక గుర్తింపు చర్య అవసరం లేదు. అంతకు ముందు బీజేపీ నేతృత్వంలోని అస్సాం ప్రభుత్వం మతం పేరుతో సమాజాన్ని విభజించడానికి ప్రయత్నించింది, ఇప్పుడు వారు కులాలు, ఉపకులాలుగా విభజించడానికి ప్రయత్నిస్తున్నారు” అని AIUDF నాయకుడు ANI తో చెప్పారు.
ఫ్లై ఓవర్ పై స్కూటీని ఢీకొట్టిన కారు.. గాల్లో పల్టీలు కొడుతూ కింద పడి... కొత్త జంట మృతి
ముఖ్యంగా ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు అనే ఆరు మత వర్గాల ప్రజలకు మైనారిటీ సర్టిఫికెట్లు అందించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించిందని చెప్పారు. దీనిని అస్సాం మంత్రి కేశబ్ మహంత ఆదివారం ప్రకటించారని తెలిపారు. అయితే ఈ చర్యతో ముస్లిం సమాజాన్ని విడిగా విభజించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అని AIUDF ఎమ్మెల్యే అమీనుల్ ఇస్లాం పేర్కొన్నారు.
‘‘ మేము దీనికి వ్యతిరేకం కాదు. కానీ ప్రభుత్వం ముస్లిం సమాజాన్ని విడిగా విభజించడానికి ప్రయత్నిస్తోంది, ఇది బ్రిటిష్ వారి విభజించి పాలించే విధానం. అదే విధానాన్ని ఇప్పుడు బీజేపీ అవలంభిస్తోంది ’’ అని అమీనుల్ ఇస్లాం అన్నారు.
కాగా.. రాష్ట్ర కేబినెట్ నిర్ణయాన్ని బీజేపీ నాయకుడు, అస్సాం రాజకీయ కార్యదర్శి జయంత మల్లా బారువా సోమవారం స్వాగతించారు. ‘‘ ఈ చర్యను స్వాగతిస్తున్నాం. ఇది ఇంతకు ముందు చేసి ఉండాల్సింది. ఇంతకు ముందు ఇతర మతపరమైన మైనారిటీ వర్గాలకు చెందిన వారికి ప్రయోజనాలు లభించలేదు. ఇప్పుడు వారికి అన్ని ప్రయోజనాలు అందుతాయి. అస్సాం ప్రభుత్వం పాఠశాల స్థాయిలోనే సర్టిఫికెట్లు జారీ చేస్తుంది. నిజమైన భారతీయులు భయపడాల్సింది ఏమీ లేదు ’’ అని ఆయన పేర్కొన్నారు.