
మూడు రాష్ట్రాల్లో మరికొద్ది సేపట్లో మూడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు మొదలవనున్నాయి. ఈ ఎన్నికల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం జరగబోయే ఎన్నికల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉత్తరాఖండ్, కేరళ, ఒడిషా రాష్ట్రాల్లో ఈ ఉప పోరు జరగనుంది. ఇందులో పలువురు అగ్ర నేతలు పోటీలో ఉన్నారు. కాబట్టి ఈ ఎన్నికలపై దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.
ఫ్లై ఓవర్ పై స్కూటీని ఢీకొట్టిన కారు.. గాల్లో పల్టీలు కొడుతూ కింద పడి... కొత్త జంట మృతి
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి చంపావత్ నుండి ప్రస్తుత ఉప ఎన్నికల్లో బరిలో ఉన్నారు. అలాగే కేరళలోని త్రిక్కాకర స్థానం నుంచి సీపీఐ-ఎం నేత, ముఖ్యమంత్రి పినరయి విజయన్, ప్రతిపక్ష నాయకుడు V.D సతీశన్‌లకు ఇది పెద్ద అగ్ని పరీక్ష లాంటిది. ఎందుకంటే వీరిద్దరూ ఇదే జిల్లాకు చెందినవారు. మరోవైపు ఒడిశాలోని బ్రజ్‌రాజ్‌నగర్ స్థానానికి జరిగే ఉప ఎన్నికలో బీజేడీ, బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది.
త్రిక్కకర ఉప ఎన్నిక
కేరళ వాణిజ్య రాజధాని కొచ్చిలోని త్రిక్కకర నియోజకవర్గంలోని 239 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు ముగుస్తుంది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో 14,000 ఓట్ల తేడాతో కాంగ్రెస్ సీనియర్ నేత పీటీ థామస్ విజయం సాధించారు. అయితే ఆయన కొంత కాలం కిందట మరణించారు. దీంతో కాంగ్రెస్ అతడి భార్య ఉమా థామస్ ను బరిలోకి దింపగా, సీపీఎం యువ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ జో జోసెఫ్‌ను రంగంలోకి దింపింది. బీజేపీ సీనియర్ నాయకుడు ఎఎన్ రాధాకృష్ణన్ ను ఎంపిక చేసింది. 140 మంది సభ్యులున్న కేరళ అసెంబ్లీలో విజయన్ నేతృత్వంలోని ప్రభుత్వం శాసన సభ్యుల సెంచరీ మార్కును అధిగమించాలని చూస్తుండగా, చికిత్స తర్వాత సీఎం యూఎస్ నుండి తిరిగి వచ్చిన తరువాత వామపక్షాల ప్రచారం ఊపందుకుంది.
చంపావత్ ఉప ఎన్నిక
ఈ ఏడాది ప్రారంభంలో ఉత్తరాఖండ్ లో ధామి బీజేపీకి అద్భుతమైన విజయాన్ని అందించినా.. స్వయంగా అతడే ఖతిమా నుండి ఓడిపోయాడు. ఈ సీటును అతను గతంలో రెండుసార్లు గెలుచుకున్నాడు. కానీ గత ఎన్నికల్లో ఓడిపోయాడు. అయినప్పటికీ ఆయన సీఎంగా మరో సారి ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఆయన ఆరు నెలల్లోపూ ఎమ్మెల్యేగా తిరిగి ఎన్నికవ్వాల్సి ఉంటుంది. ఇది తన పదవిని నిలుపుకోవడానికి రాజ్యాంగపరమైన ఆవశ్యకత. అయితే ఇప్పుడు ధామి పోటీ చేస్తున్న చంపావత్ స్థానం కూడా బీజేపీ గెలుచుకుంది. కానీ సీఎం అసెంబ్లీకి పంపించాలనే ఉద్దేశంతో సిట్టింగ్ ఎమ్మెల్యే కైలాష్ గెహ్టోరి తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఇక్కడ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఇక్కడ కాంగ్రెస్ మాజీ జిల్లా అధ్యక్షురాలు నిర్మలా గెహ్టోరితో సీఎం నేరుగా పోటీ పడుతున్నారు. సమాజ్ వాదీ పార్టీకి చెందిన మనోజ్ కుమార్ భట్, స్వతంత్ర అభ్యర్థి హిమషు గాడ్కోటి పోటీలో ఉన్నారు.
సూరత్ లో విషాదం.. బీచ్ లో ఈత కొడుతుండగా సముద్రంలోకి లాక్కుపోయిన అలలు.. ముగ్గురు మృతి
బ్రజ్ రాజ్ నగర్ ఉప ఎన్నిక
ఒడిశా నియోజకవర్గంలోని 279 బూత్‌లలో మొత్తం 2.14 లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. గత ఏడాది డిసెంబర్ లో ఎమ్మెల్యే కిశోర్ మొహంతి మరణించడంతో ఈ ఎన్నిక అనివార్యమైంది. నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బిజూ జనతాదళ్ నుంచి ఎలాగైన ఈ సీటును చేజిక్కించుకోవాలని బీజేపీ, కాంగ్రెస్ రెండూ ప్రయత్నిస్తున్నాయి. బీజేడీ ఎన్డీయేలో కూటమిలో ఉన్నప్పటికీ ఈ స్థానం నుంచి మాత్రం రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేస్తున్నాయి. మొహంతి భార్య అలకా బీజేడీ టికెట్ పై పోటీ చేస్తుండగా, బీజేపీ మాజీ ఎమ్మెల్యే రాధారాణి పాండాను, కాంగ్రెస్ కిశోర్ చంద్ర పటేల్ ను పోటీలో నిలిపాయి.