
గత కొన్ని రోజులుగా పశ్చిమ బెంగాల్‌లో మత ఘర్షణల పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే హనుమాన్ జయంతి వేడుకల సందర్భంగా రాష్ట్రంలో గురువారం మరో సారి హింస చెలరేగే అవకాశం ఉందని ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ముస్లింలను రక్షించాలని ఆయన హిందువులకు విజ్ఞప్తి చేశారు. “హిందూ సోదరులారా” అంటూ వ్యాఖ్యలు చేశారు.
'ఇది బీజేపీ కుట్ర': ఆ రాష్ట్రాల్లో జరిగిన హింసాత్మక ఘటనలపై సంజయ్ రౌత్ ఫైర్
రాష్ట్రంలో గురువారం మరో రౌండ్ హింసాత్మక ఘటనలు చేపట్టాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని మమతా బెనర్జీ అన్నారు. మైనారిటీలను హింసించకుండా చూసుకోవాలని హిందువులను కోరారు. ‘‘ఏప్రిల్ 6 (హనుమాన్ జయంతి) నాడు మైనారిటీలు హింసకు గురి కాకుండా చూసే బాధ్యతను నా హిందూ సోదరులకు అప్పగిస్తున్నాను’’ అని ఆమె అన్నారని వార్తా సంస్థ ‘పీటీఐ’ నివేదించింది. పండుగ ఐదు రోజుల కిందట జరిగినప్పటికీ కొంత మంది రాజకీయ కార్యకర్తలు హింసను ప్రేరేపించడానికి ఆయుధాలు, బాంబులు తీసుకెళ్తూ మైనారిటీ ప్రాంతాల్లో రామనవమి ఊరేగింపులను ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారని ఆమె ఆరోపించింది.
వివేకా హత్య కేసు.. తెలంగాణ హైకోర్టులో వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్..
మైనారిటీలతో పాటు షెడ్యూల్డ్ కులాలు, ఆదివాసీ వర్గాలకు రక్షణ కల్పించాలని తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ హిందువులను కోరారు. శ్రీరామనవమి అయిపోయినా ఐదు రోజుల పాటు ఊరేగింపులు ఎందుకు కొనసాగుతున్నాయని ఆమె ప్రశ్నించారు. ‘‘ పండుగ రోజు ఇలా (ఊరేగింపులు) చేయండి. మాకు ఎప్పుడూ అభ్యంతరాలు లేవు. కానీ పోలీసుల నుంచి అనుమతులు లేకుండా తుపాకులు, బాంబులతో, ర్యాలీలు నిర్వహించడానికి వీల్లేదు ’’ అని మమతా బెనర్జీ పేర్కొన్నారు.
పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ, హౌరా సహా పలు జిల్లాల్లో గత వారం నుంచి మత ఘర్షణలు, విధ్వంసాలు చోటుచేసుకుంటున్నాయి. శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా మార్చి 30న రాష్ట్రంలో హింస మొదటిసారిగా ప్రారంభమైంది. అలాగే హుగ్లీ జిల్లాలో ఆదివారం సాయంత్రం జరిగిన శ్రీరామనవమి ఊరేగింపు సందర్భంగా జరిగిన మత ఘర్షణల్లో బీజేపీ ఎమ్మెల్యే గాయపడ్డారు. ఘర్షణ నేపథ్యంలో నిషేధాజ్ఞలు విధించడంతో పాటు ఇంటర్నెట్ ను నిలిపివేశారు.
డీజే సౌండ్ తగ్గించమన్నందుకు.. నిండు గర్భణీని కాల్చేశారు!
ఈ ఘటనలపై మమతా బెనర్జీ బీజేని నిందించారు. ‘‘రామనవమి సందర్భంగా రాష్ట్రంలో బీజేపీ హింసను ప్రేరేపిస్తోందని మమతా బెనర్జీ ఆరోపించారు. హింసను ప్రేరేపించడానికి, ఉద్రిక్తతలను సృష్టించడానికి వారు ఉద్దేశపూర్వకంగా మైనారిటీ ప్రాంతాల్లోకి ప్రవేశిస్తున్నారు’’ అని ఆమె ఆరోపించారు. కాగా.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో తుపాకీతో కనిపించిన 19 ఏళ్ల యువకుడిని పశ్చిమ బెంగాల్ పోలీసులు బీహార్ లోని ముంగేర్ లో అరెస్టు చేశారు. సుమిత్ షా అనే బాలుడు శ్రీరామనవమి ఊరేగింపు సందర్భంగా తుపాకీ పట్టుకుని కెమెరాకు చిక్కాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇదిలా ఉండగా.. మత ఘర్షణలకు సంబంధించి గురువారం నుంచి పలువురిని అరెస్టు చేశారు. హింసాత్మక జిల్లాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.