గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ పై క్రేజ్..ఇంటి నుంచి పారిపోయి జైలుకు చేరుకున్న బాలికలు..సెల్పీలు దిగుతుండగా..

By Asianet NewsFirst Published Mar 17, 2023, 9:54 AM IST
Highlights

గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌ కు సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ చూసి ఆ మైనర్ అక్కా చెళ్లెల్లు ఇద్దరు ప్రభావితమయ్యారు. అతడిని కలవాలనే ఉద్దేశంతో ఢిల్లీ నుంచి ఇంట్లో చెప్పకుండా పారిపోయి పంజాబ్ కు చేరుకున్నారు. భటిండాలో ఉన్న జైలు దగ్గరికి చేరుకొని సెల్ఫీలు తీసుకున్నారు. పోలీసులు గమనించి వారిని అధికారులకు అప్పగించారు. 

పంజాబ్‌లోని భటిండాలో ఓ సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. బతిండా సెంట్రల్ జైలులో ఉన్న గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ను కలిసేందుకు ఇద్దరు మైనర్ బాలికలు ఇంటి నుంచి పారిపోయారు. అనంతరం జైలు సమీపంలోకి చేరుకున్నారు. జైలు బయట సెల్ఫీలు తీసుకున్నారు. వీరిని జైలు అధికారులు గమనించి జిల్లా బాలల సంరక్షణ విభాగానికి అప్పగించారు. 

జోధా అక్బర్ నటుడు అమన్ ధలివాల్ పై అమెరికాలో కత్తితో దాడి.. నీళ్లు కావాలంటూ వీరంగం...

ఈ ఘటనపై బటిండా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ రవ్ నీత్ కౌర్ సిద్ధూ మాట్లాడుతూ.. వీరిద్దరూ సోషల్ మీడియా ద్వారా లారెన్స్ బిష్ణోయ్ పట్ల ప్రభావితమయ్యారని, తమ ఫ్రెండ్ సర్కిల్స్ లో క్రేజ్ పెంచుకోవడానికి ఇంటి నుంచి పారిపోయి వచ్చారని తెలిపారు. ఆ అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. వీరిద్దరూ జార్ఖండ్‌కు చెందిన అక్కా చెల్లెల్లు. ప్రస్తుతం ఢిల్లీలో నివసిస్తున్నారు. స్కూల్ కు వెళ్లాలని కుటుంబ సభ్యులకు చెప్పి ఇంట్లో నుంచి బయటకు వెళ్లారు. తరువాత వారిద్దరూ బటిండాకు చేరుకున్నారు. ఆ రైల్వే స్టేషన్ లో ఒక రాత్రి నిద్రపోయారు.

అయ్యో.. తల్లిపాలు గొంతులో ఇరుక్కుని నవజాతశిశువు మృతి.. తట్టుకోలేక ఆ మాతృమూర్తి చేసిన పని...

గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌ గురించి సోషల్ మీడియా వస్తున్న వార్తలు, జరుగుతున్న చర్చలు, అతడికి ఉన్న ఫేమ్ చూసి వారు ప్రభావితమయ్యారు. ఎలాగైనా అతడిని కలవాలనే ఉద్దేశంతో గురువారం బటిండా సెంట్రల్ జైలు దగ్గరికి వచ్చారు. ఇద్దరూ జైలు బయట సెల్ఫీలు దిగడం ప్రారంభించారు. వాటిని స్నేహితులకు చూపించాలని భావించారు. కానీ వీరిని భద్రతా సిబ్బంది గమనించారు. మీరెవరు ? ఎక్కడి నుంచి వచ్చారని ప్రశ్నించారు. అనంతరం ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.

వీడి దుంపతెగ.. తాగినమత్తులో తన పెళ్లి సంగతే మర్చిపోయాడు.. మండపానికే వెళ్లలేదు.. ఆ వధువు ఏం చేసిందంటే...

అధికారులు మైనర్ బాలికల కుటుంబ సభ్యులను పిలిపించారు. ఇద్దరికీ వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం సఫీ సెంటర్ కు పంపించామని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గురుప్రీత్ సింగ్ తెలిపారు. మొత్తం వ్యవహారంపై విచారణ జరుపుతున్నామని చెప్పారు. దర్యాప్తులో ఏదైనా తేలితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు ఇదిలా ఉండగా.. ఢిల్లీతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఉగ్రదాడులు జరిపేందుకు యువతను రిక్రూట్ చేసుకోవడానికి కుట్ర పన్నారన్న ఆరోపణలతో గతేడాది నవంబర్ 23న జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఈ గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ను అరెస్టు చేసింది. అతడు ప్రస్తుతం పంజాబ్‌లోని భటిండాలో ఉన్నాడు. 

click me!