జోధా అక్బర్ నటుడు అమన్ ధలివాల్ పై అమెరికాలో కత్తితో దాడి.. నీళ్లు కావాలంటూ వీరంగం...

By SumaBala BukkaFirst Published Mar 17, 2023, 9:31 AM IST
Highlights

ఓ భారతీయ నటుడి మీద అమెరికాలో కత్తితో దాడి చేశాడో దుండగుడు. నన్ను అడ్వాంటేజ్ గా తీసుకోవాలనుకుంటున్నారా? నాకు నీళ్లు కావాలి..అని అరుస్తూ అతను దాడికి దిగాడు. 

కాలిఫోర్నియా : అమెరికాలో ఓ భారతీయ నటుడి మీద కత్తితో గుర్తు తెలియని వ్యక్తులు దాడికి దిగారు. ప్రముఖ పంజాబీ నటుడు అమన్ ధలివాల్ పై ఓ గుర్తు తెలియని వ్యక్తి అమెరికాలో కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో అమన్ శరీరంపై అనేకచోట్ల గాయాలయ్యాయి.  గురువారం ఉదయం కాలిఫోర్నియాలోని ప్లానెట్ ఫిట్నెస్ జిమ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. జిమ్ లో వ్యాయామం చేసేందుకు వెళ్లిన ధలివాల్ పై నిందితుడు ఒక్కసారిగా దాడికి దిగాడు. దీంతో అక్కడున్న వారంతా  దిగ్బ్రాంతికి గురయ్యారు. 

వెంటనే తేరుకున్న  జిమ్ సిబ్బంది.. అప్పటికే తీవ్ర గాయాల పాలైన ధలివాల్ ను  దగ్గరలోని ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ధలివాల్ పై దుండగుడు దాడి చేయడం.. దీనికి సంబంధించిన సంఘటన మొత్తం జిమ్ లోని సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది. అయితే, ధలివాల్ పై నిందితుడు ఎందుకు దాడి చేశాడు అన్న విషయం మీద పెద్దగా స్పష్టత రావడం లేదు. ఈ దాడి ఘటన నేపథ్యంలో ప్రస్తుతం ఈ సీసీటీవీ రికార్డు వీడియో..  ఒళ్లంతా కట్లతో ఉన్న అమన్ ధలివాల్ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

అయ్యో.. తల్లిపాలు గొంతులో ఇరుక్కుని నవజాతశిశువు మృతి.. తట్టుకోలేక ఆ మాతృమూర్తి చేసిన పని...

అమన్ ధలివాల్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది అన్న విషయం మీద ఎలాంటి స్పష్టత లేదు. కుటుంబ సభ్యులు కానీ,  వైద్యులు కానీ అతని ఆరోగ్య పరిస్థితి మీద ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. ధలివాల్ పంజాబ్ లోని మాన్సాలో జన్మించారు. తెలుగు, పంజాబీ, హిందీ  సినిమాల్లో నటించారు.  ఐశ్వర్యరాయ్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన జోధా అక్బర్ సినిమాలో నటించాడు. ఆ సినిమాలో రాజ్ కుమార్  రతన్ సింగ్ పాత్రలో మెప్పించారు. ఇక తెలుగులో ఖలేజా సినిమాలోని కనిపించారు. విస్రా, ఇక్ కుడి పంజాబ్ డి, జాట్ బాయ్స్ పూత్ జట్టన్ డి, అనంత్ ది ఎండ్  లాంటి అనేక చిత్రాల్లో నటించారు. 

సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియోలో దాడి చేసిన వ్యక్తి, నీలిరంగు హూడీలో, నటుడి చేతిని పట్టుకుని కనిపిస్తున్నాడు. అదే చేతిలో గొడ్డలిలాంటి  టోమాహాక్ ఉంది. మరో చేతిలోని కత్తితో నటుడి మీద దాడి చేశాడు. నీటి కోసం బిగ్గరగా అరుస్తున్నాడు.. "ప్లీజ్, మమ్మల్ని గౌరవించండి. నాకు నీళ్లు ఇవ్వండి. నాకు వాటర్ కావాలి," అతను బిగ్గరగా అరిచాడు. ఈ సమయంలో అమన్ ఎలాంటి స్పందన లేకుండా ప్రశాంతంగా ఉన్నాడు. దీంతో దుండగుడు అతని మీద సైకోలాగా అరిస్తూ.. కత్తితో బెదిరించాడు.

"నన్ను వాడుకోవాలనుకుంటున్నారా? అంటూ మ్‌లోని ఇతరులపై అరుస్తూ కనిపించాడు. ఆ వ్యక్తి ఒక్క సెకన్ ధలివాల్ నుంచి తన దృష్టిని మరల్చినప్పుడు, అదే సమయం కోసం ఎదురుచూస్తున్న  6-అడుగుల పొడవైన అమన్ ఆ క్షణాన్ని స్వాధీనం చేసుకుని, ఆ వ్యక్తిని నేలపైకి నెట్టడంతో జిమ్ లోని మిగతావారు అతడిని గట్టిగా పట్టుకున్నట్టు వీడియోలో కనిపిస్తుంది. ఆ వ్యక్తిని అరెస్టు చేసినట్లు తెలిసింది.

కాలిఫోర్నియాలోని గ్రాండ్ ఓక్స్‌లోని ప్లానెట్ ఫిట్‌నెస్‌ జిమ్‌ లో ఈ సంఘటన జరిగింది. ధాలివాల్ జిమ్‌లో వర్కవుట్ చేస్తుండగా నిందితుడు అతనిపై దాడి చేశారు. ధాలివాల్ చేతులు, మొండెంపై అనేక గాయాలు తగిలినట్లు ఫోటోలు చూపిస్తున్నాయి. అతని ఛాతీ, చేతులు, తలపై అనేక బ్యాండేజీలతో ఆసుపత్రిలో ఉన్న ఫొటోలు కూడా వైరల్ అవుతున్నాయి. 
 

 

Punjabi actor Arman Dhaliwal was critically attacked in America when he was exercising in the Planet Fitness gym. Arman Dhaliwal bravely subdued the attacker. pic.twitter.com/QXQDH3FI4j

— Gagandeep Singh (@Gagan4344)
click me!