
ప్రతిరోజూ మన దేశంలో ఎంతో మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా ఈ ప్రమాదాలు హైవేలపై జరుగుతూ ఉంటాయి. అయితే.... ఆ ప్రమాదాలు హెల్మెట్లు, సీటు బెల్టులు ధరించకపోవడం వల్లే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ విషయం తెలిసినా చాలా మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంటారు. రోడ్డు మీద వెళ్లే సమయంలో కనీస జాగ్రత్తలు కూడా తీసుకోరు. పోలీసులు, ప్రభుత్వాలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ ప్రజల్లో మార్పు మాత్రం రావడం లేదు. ఈ క్రమంలో ప్రజల్లో మార్పు తీసుకురావడానికి హెల్మెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా బయలుదేరాడు.
బీహార్‌కు చెందిన ఒక వ్యక్తి నిర్లక్ష్యంగా ఉన్న డ్రైవర్లకు అవగాహన కల్పించే బాధ్యతను తీసుకున్నాడు.బైక్ నడుపుతున్నప్పుడు హెల్మెట్ ధరించాల్సిన ప్రాముఖ్యతను వారికి బోధించాడు.
తనను తాను 'హెల్మెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా' అని పిలుచుకునే రాఘవేంద్ర కుమార్ బైక్ నడుపుతున్నప్పుడు హెల్మెట్ ధరించాల్సిన ప్రాముఖ్యత గురించి ప్రజలకు అవగాహన కల్పించే ప్రచారం కోసం ఇంటర్నెట్‌లో బాగా ప్రాచుర్యం పొందాడు.
కుమార్ తన ఇటీవలి పోస్ట్‌లలో ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై తీసిన క్లిప్‌ను పంచుకున్నారు. వీడియోలో హెల్మెట్ ధరించి కారు నడుపుతూ కనిపించాడు. క్లిప్ కొనసాగుతుండగా, కుమార్ హెల్మెట్ లేని బైకర్‌ని సూచించడానికి కిటికీలోంచి సరికొత్త హెల్మెట్‌ను బయట పెట్టాడు.
వ్యక్తి ఆగిన తర్వాత, కుమార్ అతనికి హెల్మెట్ ఇచ్చి, బైక్ నడుపుతున్నప్పుడల్లా దానిని ధరించమని అడిగాడు. ఆ వ్యక్తి వీడియోలో కుమార్‌కి కృతజ్ఞతలు తెలిపాడు.
“నేను నా కారు వేగాన్ని 100 కంటే ఎక్కువ తీసుకోను, కానీ లక్నో ఎక్స్‌ప్రెస్‌వేలో ఒక వ్యక్తి నన్ను అధిగమించినప్పుడు, హెల్మెట్ లేకుండా అతని వేగం మన కంటే ఎక్కువగా ఉండటంతో నేను ఆశ్చర్యపోయాను. అతనికి సేఫ్టీ హెల్మెట్ ఇవ్వడానికి, నేను నా కారును 100కి పైగా నడపాల్సి వచ్చింది. చివరకు అతన్ని పట్టుకున్నాను, ”అని ఆ వీడియోకి క్యాప్షన్ పెట్టాడు.
పోస్ట్‌కి 1.1 మిలియన్ల వీక్షణలు, టన్నుల కొద్దీ స్పందనలు వచ్చాయి. అతను చేసిన పనికి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.