బస్సులో బీరు తాగి రచ్చ చేసిన విద్యార్థినిలు.. వైరల్ అవుతున్న వీడియోలు..

Published : Mar 24, 2022, 03:49 PM IST
బస్సులో బీరు తాగి రచ్చ చేసిన విద్యార్థినిలు.. వైరల్ అవుతున్న వీడియోలు..

సారాంశం

స్కూల్‌ విద్యార్థినులు బస్సులో మద్యం సేవిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. అయితే ఈ ఘటన తమిళనాడులోని చెంగల్‌పట్టు జిల్లాలో (Chengalpattu district) చోటుచేసుకుంది. 

స్కూల్‌ విద్యార్థినులు బస్సులో మద్యం సేవిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. అయితే ఈ ఘటన తమిళనాడులోని చెంగల్‌పట్టు జిల్లాలో (Chengalpattu district) చోటుచేసుకుంది. కదులుతున్న బస్సులో విద్యార్థినులు మద్యం తాగుతున్న దృశ్యాలను ఓ విద్యార్థి రికార్డు చేసినట్టుగా భావిస్తున్నారు. ఈ వీడియోలో అబ్బాయిలు, అమ్మాయిల బృందం బీర్ బాటిల్ తెరిచి.. మద్యం తాగినట్టుగా ఉంది.  కొందరు అమ్మాయిలు మద్యం తాగుతున్నట్టుగా కనిపిస్తుండగా.. పక్కనే మరికొందరు అబ్బాయిలు కూడా ఉన్నారు. అమ్మాయిలు మద్యం తాగడమే కాకుండా పెద్దగా కేకలు వేస్తూ కనిపించారు. విద్యార్థులంతా చెంగల్‌పట్టులోని ప్రభుత్వ పాఠశాలకు చెందిన వారుగా భావిస్తున్నారు.

తొలుత ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన తర్వాత చాలా మంది పాత వీడియోగా భావించారు. అయితే ఈ ఘటన మంగళవారం చోటుచేసుకుందని పోలీసులు గుర్తించారు. పాఠశాల యూనిఫామ్ ధరించిన విద్యార్థులు Thirukazhukundram నుంచి తాచూర్‌కు బస్సులో వెళ్తుండగా చోటుచేసుకుందని కనుగొన్నారు. ఈ ఘటనను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్టుగా జిల్లా విద్యాశాఖ అధికారులు తెలిపారు. పోలీసులు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారని  చెప్పారు. విచారణ పూర్తయ్యాక తగిన చర్యలు తీసుకుంటామన్నారు.

చెంగల్‌పట్టు జిల్లా విద్యా అధికారిణి రోజ్ నిర్మల స్పందిస్తూ.. “ఇది పాఠశాల వెలుపల జరిగింది. కాబట్టి పోలీసులు దాని గురించి విచారణ జరుపుతున్నారు. అది ముగిసిన తర్వాత మేము తగిన చర్య తీసుకుంటాము” అని తెలిపారు. 

ఈ వీడియో వైరల్‌గా మారడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ వీడియోలను చూసిన నెటిజన్లు పలువురు సోషల్ మీడియా వేదికగా విద్యార్థుల ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తున్నారు. సమాజంలో ఇలాంటి పోకడలు అనర్థాలకు దారితీస్తాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

DAIS : ఐశ్వర్యారాయ్ కూతురు చదివే ధీరూభాయ్ అంబానీ స్కూల్ ఫీజు ఎంత?
ఆకాష్, అనంత్ అంబానీలు తెలుసు... మరి ఎవరీ జై అన్మోల్ అంబానీ?