తల్లిదండ్రులు లేని బాలికపై ఏడేళ్లుగా అక్క భర్త అత్యాచారం

Published : Nov 05, 2020, 08:27 AM IST
తల్లిదండ్రులు లేని బాలికపై ఏడేళ్లుగా అక్క భర్త అత్యాచారం

సారాంశం

మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో ఓ బాలిక తన అక్క భర్త చేతిలో అఘాయిత్యానికి గురైంది. తల్లిదండ్రులు కోల్పోవడంతో అక్క ఇంటికి వచ్చిన బాలికపై ఏడేళ్లుగా అతను అత్యాచారం చేస్తూ వచ్చాడు.

భోపాల్: తల్లిదండ్రులను కోల్పోయిన బాలికపై బావ దారుణానికి పాల్పడ్డాడు. 9 ఏళ్ల వయస్సులో తల్లిదండ్రులను కోల్పోయిన బాలికకు బావ ఆశ్రయం ఇచ్చాడు. అయితే, ఆమెపై అతనే అత్యాచారానికి పాల్పిడన ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. 

భోపాల్ కు చెందిన ఓ మైనర్ బాలిక తల్లిదండ్రులు 2014లో మరణించారు. దాంతో మైనర్ బాలికను, ఆమె అన్ననను అక్కాబావలు తమ ఇంటికి తీసుకుని వెళ్లారు. అయితే, బాలికపై అక్క భర్త కన్నేశాడు. 9 ఏళ్ల వయస్సు నుంచి ఏడేళ్లుగా బాలికపై అతను అత్యాచారం చేస్తూ వచ్చాడు.

బాలికను తన మిత్రుడిని ఇంటికి తీసుకుని వెళ్లి అక్కడ ఆమెపై అత్యాచారం చేస్తూ వచ్చాడు. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని బాలికను బెదిరించాడు. దాంతో ఇప్పటి వరకు ఆ విషయం వెలుగులోకి రాలేదు. 

కొన్నేళ్ల తర్వాత బాలిక అన్నకు ఉద్యోగం వచ్చింది. దాంతో బావ ఇంటి నుంచి బాలిక బయటకు వచ్చింది. బాలిక ఓ స్వచ్ఛంద సంస్తలో చేరి కొన్ని నెలలుగా అక్కడ పనిచేస్తూ వస్తోంది. తన బావ చేసిన అకృత్యాన్ని బాలిక తన స్నేహితురాలికి ఇటీవల చెప్పింది. మిత్రురాలి ద్వారా స్వచ్ఛంద సంస్థ కార్యకర్తకు ఆ విషయం తెలిసింది. 

కార్యకర్త సాయంతో సోమవారం బాలిక అక్క భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

IRCTC Char Dham Yatra: కేదార్‌నాథ్, బద్రీనాథ్ పుణ్యక్షేత్రాల దర్శనంతో ఐఆర్‌సీటీసీ చార్ ధామ్ యాత్ర క్రేజీ ప్యాకేజీ.. పూర్తి వివరాలు ఇవే !
జపాన్ ప్రధాని కి భారత్ స్టైల్ ల్లో అదిరిపోయే వెల్ కమ్ | PM Modi Welcomes Japanese PM Sanae Takaichi