నన్ను పోలీసులు కొట్టారు: అర్నాబ్ గోస్వామి

By narsimha lodeFirst Published Nov 4, 2020, 3:33 PM IST
Highlights

తనను పోలీసులు కొట్టారని రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామి చెప్పారు. బుధవారం నాడు ఉదయం ఆయనను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు.

ముంబై: తనను పోలీసులు కొట్టారని రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామి చెప్పారు. బుధవారం నాడు ఉదయం ఆయనను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇవాళ ఉదయం గోస్వామిని ఇంట్లో అరెస్ట్ చేసిన తర్వాత అలీబాగ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.53 ఏళ్ల ఇంటిరీయర్ డిజైనర్ ఆత్మహత్యకు అర్నాబ్ గోస్వామిపై కేసు నమోదైంది. ఈ కేసులో బుధవారం నాడు ముంబై పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.

Latest Videos

తనపై దాడి చేయడమే కాకుండా తన భార్య, కొడుకు, అత్తమామాలను పోలీసులు నెట్టివేశారని ఆయన ఆరోపించారు.2018లో అర్కిటెక్ట్ అతని తల్లి ఆత్మహత్య చేసుకొన్నారు. రిపబ్లిక్ టీవీ నుండి బకాయిలు చెల్లించకపోవడంతో వారిద్దరూ ఆత్మహత్యకు పాల్పడినట్టుగా  సిఐయూ సీఐ సచిన్ వాజే చెప్పారు.ఐపీసీ  306, 34 సెక్షన్ల కింద అరెస్ట్ చేశామన్నారు.

also read:కక్ష సాధింపు కాదు, తప్పు చేస్తే ఎవరైనా...: అర్నబ్ అరెస్ట్ పై సంజయ్ రౌత్

ఇంటీరియర్ డిజైనర్ అన్వయ్ నాయక్, ఆయన తల్లి కుముద్ నాయక్ లు 2018 మే మాసంలో అలీబాగ్ లోని తమ ఇంట్లో ఆత్మహత్య చేసుకొన్నారు.వీరు ఆత్మహత్య చేసుకొన్న ప్రాంతంలో ఒక సూసైడ్ లేఖను స్వాధీనం చేసుకొన్నారు. అన్వయ్ రాసినట్టుగా చెబుతున్న లేఖను పోలీసులు అప్పట్లో స్వాధీనం చేసుకొన్నారు.

అర్నబ్ గోస్వామి, ఐకాస్ట్, ఎస్‌కె మీడియాకు చెందిన ఫిరోజ్ షేక్, స్మార్ట్ వర్క్స్ కు చెందిన నితేష్ సర్దా లు తమకు రూ. 5.40 కోట్లు చెల్లించాలని సూసైడ్ నోట్ లో పేర్కొన్నారు.

ఈ డబ్బులు రాకపోవడంతో తాము ఆర్ధికంగా ఇబ్బందుల్లో పడ్డామని రాశారు. ఈ లేఖ ఆధారంగా రాయగడ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో షేక్, సర్దాలను పోలీసులు ఇదివరకే అరెస్ట్ చేశారు. 

అన్వయ్ ఇంట్లోని ఫస్ట్ ఫ్లోర్ లో ఉరేసుకొన్నాడు. ఇంటి కింది ఫ్లోర్ లో కుముద్ డెడ్ బాడీని పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. ఈ కేసు విచారణ సమయంలో అన్వయ్ భారీగా అప్పుల్లో ఉన్న విషయాన్ని పోలీసులు గుర్తించారు. కాంట్రాక్టర్లకు డబ్బులు తిరిగి చెల్లించే పరిస్థితుల్లో లేడని గుర్తించారు.

ఈ ఏడాది మే మాసంలో ఈ కేసును తిరిగి ఓపెన్ చేయాలని అన్వయ్ కూతురు అద్నా మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ ను కోరారు.తన తండ్రి, నానమ్మ మరణం విషయంలో గోస్వామి నుండి బకాయిలు చెల్లించని విషయంలో అలీబాగ్ పోలీసులు దర్యాప్తుచేయలేదని అద్నానాయక్ ఫిర్యాదు చేశారు. 

ఈ కేసును తిరిగి విచారణ చేయాలని పోలీసులను ఆదేశించినట్టుగా మహారాష్ట్ర  హోంమంత్రి  మే మాసంలో ప్రకటించారు. 


 

click me!