
న్యూఢిల్లీ: ఎన్డీఏ మాత్రమే బీహార్ యువతకు భద్రతతో పాటు ఉపాధి అవకాశాలను అందించగలదని ప్రధాని మోడీ చెప్పారు.
బుధవారం సాయంత్రం ప్రధాని మోడీ ట్విట్టర్ వేదికగా బీహార్ ఎన్నికల ప్రచారం గురించి ప్రస్తావించారు.ఆధునిక మౌలిక సదుపాయాలపై అపూర్వమైన పెట్టుబడులు... కొత్త ఉపాధి అవకాశాలను తీసుకొస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.ముద్ర యోజన, స్టాండ్ ఆఫ్ ఇండియా పథకం కింద బీహార్ కు లక్ష కోట్ల రూపాయాలు ఇస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.