నాలుగేళ్ల జైలు శిక్ష: ఘాజీపూర్ ఎంపీ అన్సారీపై అనర్హత వేటు

Published : May 01, 2023, 08:21 PM ISTUpdated : May 01, 2023, 09:33 PM IST
     నాలుగేళ్ల జైలు శిక్ష: ఘాజీపూర్ ఎంపీ అన్సారీపై  అనర్హత వేటు

సారాంశం

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఘాజీపూర్  ఎంపీపై  ఇవాళ అనర్హత వేటు పడింది.  అన్సారీకి నాలుగేళ్ల జైలు శిక్ష పడడంతో  అన్రహత వేటు పడింది.  

న్యూఢిల్లీ: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఘాజీపూర్ ఎంపీ అఫ్జల్ అన్సారీ పై  అనర్హత వేటు  పడింది.  అన్సారీకి నాలుగేళ్ల జైలు శిక్ష పడడంతో  అన్సారీ  ఎంపీ పదవిపై  అనర్హత వేటు పడింది.2007  క్రిమినల్ కేసులో  అన్సారీని కోర్టు దోషిగా తేల్చింది. 

బీఎస్పీకి  చెందిన  ఎంపీ అన్సారీకి  నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది  కోర్టు.  అతని సోదరుడు  ముక్తార్  అన్సారీకి  పదేళ్ల జైలు శిక్ష విధించింది.  సోమవారంనాడు కోర్టు  ఈ తీర్పును వెల్లడించింది.  ఈ కోర్టు తీర్పు కారణంగా యూపీలోని ఘాజీపూర్  నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న  అఫ్జల్ అన్సారీ తన ఎంపీ పదవిని కోల్పోయాడు.  ఏప్రిల్  29, 2023 నుండి  అఫ్జల్ అన్సారీ  తన ఎంపీ  పదవిని కోల్పోయారు. ఈ మేరకు లోక్ సభ ప్రకటించింది. 

2007లో  అన్సారీ సోదరులపై  గ్యాంగ్‌స్టర్ చట్టం కింద  కేసు నమోదు చేయగా, 2022లో  వీరిపై  ప్రాథమిక అభియోగాలు మోపారు.  ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత  శనివారంనాడు కోర్టు  తీర్పును వెల్లడించింది. ఈ ఏడాది మార్చి మాసంలో  కాంగ్రెస్ పార్టీ అగ్రనేత  రాహుల్ గాంధీకి కూడా  సూరత్ కోర్టు  శిక్ష విధించడంతో  ఆయన  తన ఎంపీ సభ్యత్వాన్ని కోల్పోయారు.

 దొంగలందరి ఇంటి పేరు మోడీ ఎలా ఉందని  రాహుల్ గాంధీ చేసిన విమర్శలపై   గుజరాత్ రాష్ట్రానికి చెందిన  మాజీ మంత్రి, బీజేపీ  ఎమ్మెల్యే  దాఖలు  చేసిన  ప,రువు  నష్టం దావాపై  సూరత్ కోర్టు   తీర్పును వెల్లడించింది. ఈ కేసులో రాహుల్ గాంధీకి  రెండేళ్ల జైలు శిక్షను విధించింది. ఈ తీర్పు వెల్లడించిన మరునాడే  రాహుల్ గాంధీ పై లోక్ సభ సెక్రటేరియట్ అనర్హత వేటు వేసింది. 

PREV
click me!

Recommended Stories

Coldest Places in India : మైనస్ 50°C ఉష్ణోగ్రతలా..! అత్యంత చలిగావుండే టాప్ 5 ప్రదేశాలివే
Gen z పోస్టాఫీస్‌లు వ‌చ్చేస్తున్నాయ్‌.. వీటి ప్ర‌త్యేక‌త ఏంటి.? వీటిలో ఏముంటాయ్‌..