అశ్లీల వీడియోలతో మహిళల కొత్త రకం దందా.. తెలివిగా ఆటకట్టించిన పోలీసులు..!

Published : Oct 23, 2021, 09:30 AM IST
అశ్లీల వీడియోలతో మహిళల  కొత్త రకం దందా.. తెలివిగా ఆటకట్టించిన పోలీసులు..!

సారాంశం

కొందరు మహిళలు అశ్లీల వీడియోలతో బ్లాక్ మెయిల్ చేసిన నయా రాకెట్ బాగోతాన్ని ఘజియాబాద్ పోలీసులు రట్టు చేశారు. 

మోసాలు చేయడంలో మహిళలు కూడా ఆరితేరుతున్నారు అని చెప్పడానికి ఈ సంఘటనే ఉదాహరణ. తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్ నగరంలో కొందరు మహిళలు కొత్త రకం మోసానికి తెర లేపారు. కాగా.. వారి మోసాలను పోలీసులు తెలివిగా ఆటకట్టించారు.

Also Read: అలర్ట్.... 12 గంటలపాటు నిలిచిపోనున్న ఆదాయపుపన్ను వెబ్ సైట్

 కొందరు మహిళలు అశ్లీల వీడియోలతో బ్లాక్ మెయిల్ చేసిన నయా రాకెట్ బాగోతాన్ని ఘజియాబాద్ పోలీసులు రట్టు చేశారు. స్ట్రిప్ చాట్ ద్వారా యువకులను బ్లాక్ మెయిల్ చేసిన సెక్స్ టార్షన్ రాకెట్ సభ్యులను పోలీసులు శనివారం అరెస్టు చేశారు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. ఘజియాబాద్ నగరంలో కొందరు మహిళలు  న్యూడ్ వీడియో క్లిప్ ల ద్వారా యువకులను బ్లాక్ మెయిల్ చేశారని ఘజియాబాద్ జిల్లా ఎస్పీ నిపుణ్ అగర్వాల్ చెప్పారు. ఘజియాబాద్ నగరంలో ఓ మహిళ తన భాగస్వామితో కలిసి సెక్స్ టూరిజం రాకెట్ నడుపుతున్నట్లు సమాచారం అందడంతో పోలీసులే మారువేషంలో విటులుగా వ్యవహరించి నిందితురాలిని అరెస్టు చేశారు. 

 

ఇద్దరు అమ్మాయిలను గోవా పర్యటనకు పంపించారు. విమానాశ్రయంలో విటుల్లాగా మారువేషంలో వచ్చిన పోలీసులు ముగ్గురు మహిళలను పట్టుకున్నారు. సీఐఎస్‌ఎఫ్‌, ఎయిర్‌పోర్టు పోలీసుల సాయంతో ప్రధాన నిందితురాలిని పట్టుకున్నారు. విచారణ కోసం ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడ మహిళ తన నేరాన్ని అంగీకరించింది. దీంతో నిందితురాలిని ఒకరోజు పోలీసు కస్టడీకి అనుమతించడంతో కోర్టు ముందు ప్రవేశపెట్టారు.

PREV
click me!

Recommended Stories

Republic Day Parade: ఘనంగా గణతంత్ర దినోత్సవ పరేడ్ సన్నాహాలు| Asianet News Telugu
Fresh Snowfall in Shimla Delights Tourists: రికార్డు స్థాయిలో సిమ్లాలో మంచు వర్షం| Asianet Telugu