ఉత్తరాఖండ్ విషాదం.. 11మంది ట్రెక్కర్లు మృతి, కొనసాగుతున్న సహాయకచర్యలు

Published : Oct 23, 2021, 08:06 AM IST
ఉత్తరాఖండ్ విషాదం.. 11మంది ట్రెక్కర్లు మృతి, కొనసాగుతున్న సహాయకచర్యలు

సారాంశం

హిమాచల్ ప్రదేశ్‌లోని కిన్నౌర్ జిల్లాను Uttarakhandలోని హర్సిల్‌తో కలిపే అత్యంత ప్రమాదకరమైన పాస్‌లలో ఒకటైన లంఖాగా పాస్‌కు వెళ్లే ప్రాంతం నుండి ఇప్పటివరకు 11 మృతదేహాలను వెలికితీశారు.

న్యూఢిల్లీ : ఉత్తరాఖండ్‌లోని లంఖగా పాస్‌లో 17,000 అడుగుల ఎత్తులో వైమానిక దళం భారీ రెస్క్యూ ఆపరేషన్‌ను ప్రారంభించింది, ఇక్కడ అక్టోబర్ 18న భారీ హిమపాతం, ప్రతికూల వాతావరణం కారణంగా పర్యాటకులు, పోర్టర్లు, గైడ్‌లతో సహా 17 మంది ట్రెక్కర్లు దారి తప్పిపోయారు. 

హిమాచల్ ప్రదేశ్‌లోని కిన్నౌర్ జిల్లాను Uttarakhandలోని హర్సిల్‌తో కలిపే అత్యంత ప్రమాదకరమైన పాస్‌లలో ఒకటైన లంఖాగా పాస్‌కు వెళ్లే ప్రాంతం నుండి ఇప్పటివరకు 11 మృతదేహాలను వెలికితీశారు.

అక్టోబరు 20న అధికారులు చేసిన SOS కాల్‌కు భారత వైమానిక దళం స్పందించింది. రాష్ట్రంలోని పర్యాటక హిల్ స్టేషన్ అయిన హర్సిల్ చేరుకోవడానికి రెండు అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్ (ALH) ఛాపర్‌లను మోహరించింది.

అక్టోబరు 20న నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF)కి చెందిన ముగ్గురు సిబ్బందితో ALH క్రాఫ్ట్‌లో మధ్యాహ్నం 19,500 అడుగుల గరిష్టంగా అనుమతించదగిన ఎత్తులో search and rescue ప్రారంభమైంది.

మరుసటి రోజు, ఎట్టకేలకు రెండు రెస్క్యూ సైట్‌లను గుర్తించగలిగిన స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (SDRF) సిబ్బందితో ఒక ALH లో గాలింపుకు బయల్దేరింది.  రెస్క్యూ టీమ్‌ని 15,700 అడుగుల ఎత్తు వరకు చేరేలా చేసింది.అక్కడ నాలుగు మృతదేహాలు కనుగొన్నారు.

ఆ తరువాత హెలికాప్టర్ మరొక ప్రదేశానికి చేరుకుంది. 16,800 అడుగుల ఎత్తులో ప్రాణాలతో  కదలలేని స్థితిలో ఉన్న ఓ వ్యక్తిని గుర్తించారు. 

అక్టోబర్ 22 న, ALH day break ఫ్లైట్ తీసుకుంది. అననుకూలమైన భూభాగం, బలమైన గాలి పరిస్థితులు ఉన్నప్పటికీ సిబ్బంది ప్రాణాలతో బయటపడిన, 16,500 అడుగుల ఎత్తు నుండి ఐదు మృతదేహాలను నాలుగు షటిల్‌లలో తిరిగి తీసుకురాగలిగారు.

మరో రెండు మృతదేహాలు కనుగొన్నారు. డోగ్రా స్కౌట్స్, 4 అస్సాం,  రెండు ITBP బృందాల జాయింట్ పెట్రోలింగ్ ద్వారా నిథాల్ థాచ్ శిబిరానికి కాలినడకన తిరిగి తీసుకువస్తున్నారు. తప్పిపోయిన మిగిలిన వ్యక్తులను గుర్తించడానికి, రక్షించడానికి శనివారం ALH సిబ్బంది సెర్చ్ ను  చేపట్టనున్నారు.

సహాయక బృందాలు మృతదేహాలను స్థానిక పోలీసులకు అప్పగించాయి. ప్రాణాలతో బయటపడిన వారిని ఉత్తరకాశీలోని జిల్లా ఆసుపత్రికి తరలించే ముందు హర్సిల్‌లో ప్రథమ చికిత్స అందించారు.

ఉత్తరాఖండ్‌లో వర్షాలకు 16 మంది మృతి.. నైనితాల్‌కు రాకపోకలు బంద్

కాగా, భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన ఉత్తరాఖండ్‌లో ఏరియల్ సర్వే నిర్వహించారు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా. సీఎం పుష్కర సింగ్‌ ధామీ , గవర్నర్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ గుర్మీత్‌ సింగ్‌తో కలిసి ఆయన గురువారం వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. ఎన్నడూ లేని విధంగా ఉత్తరాఖండ్‌లో uttara khand floods నాలుగు రోజుల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన కుండపోత వర్షాలకు 52 మంది మృత్యువాత పడ్డారు.

ఇక కుండపోత వానలు, వరదల ధాటికి కుదేలైన ఉత్తరాఖండ్‌లో సహాయకచర్యలు చేపట్టింది రెస్క్యూ టీమ్‌. indian airforce చెందిన మూడు హెలికాఫ్టర్లు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. విరిగిపడిన కొండచరియలను తొలగిస్తున్నారు. మరోవైపు మృతుల కుటుంబాలకు 4 లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు సీఎం పుష్కరసింగ్‌ ధామీ. 

పంటనష్టంపై నివేదిక సమర్పించాలని ఆయన కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రానికి భారీగా నష్టం వాటిల్లిందని..కోలుకోవడానికి సమయం పడుతుందని తెలిపారు. సహాయక చర్యల నిమిత్తం ప్రతి జిల్లాకు 10 కోట్లు చొప్పున మంజూరు చేశారు. రాష్ట్ర పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలు రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామితో ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా సీఎంతో మాట్లాడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. 

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్