మద్యం పార్టీలో అంబులెన్స్ డ్రైవర్, ఆలస్యంగా ఆసుపత్రికి: మార్యమధ్యలోనే రోగి మృతి

Published : Sep 10, 2021, 04:42 PM IST
మద్యం పార్టీలో అంబులెన్స్ డ్రైవర్, ఆలస్యంగా ఆసుపత్రికి: మార్యమధ్యలోనే రోగి మృతి

సారాంశం

రోగిని ఆసుపత్రికి తరలించాల్సిన అంబులెన్స్ డ్రైవర్ మద్యం తాగుతూ ఆలస్యం చేయడం వల్ల ఓ రోగి మరణించాడు. అంబులెన్స్ డ్రైవర్ మద్యం పార్టీలో ఉన్న దృశ్యాలను రోగి బంధువులు వీడియో తీశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

కాన్పూర్:ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ లో అంబులెన్స్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఓ రోగి మరణించాడు. కాన్పూర్ గ్రామీణ ప్రాంతంలోని గజ్వేర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకొంది.గజ్వేర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రూపూర్ గ్రామానికి చెందిన సుర్జన్ సింగ్ ను ఏదో కరిచింది. దీంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చికిత్స కోసం వెళ్లాడు. దీంతో వైద్యులు అతడిని మెరుగైన వైద్యం కోసం కాన్పూరు ఆసుపత్రికి తరలించేందుకు రిఫర్ చేశారు. అంబులెన్స్ డ్రైవర్ అనుజ్,సిబ్బంది కోమల్ బాబుకి సమాచారం అందింది.

అయితే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలోనే అంబులెన్స్ డ్రైవర్ అనుజ్ మద్యం పార్టీలో పాల్గొన్నాడు. కాన్పూరు పెద్దాసుపత్రికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్ డ్రైవర్ ఆలస్యం చేశాడు. అనుజ్ తో పాటు మరికొందరు అంబులెన్స్ డ్రైవర్లు కూడ మద్యం పార్టీలో పాల్గొన్నారు. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు అంబులెన్స్ డ్రైవర్ మద్యం పార్టీలో ఉన్న వీడియోను తీశారు. దీంతో అతను వారితో ఘర్షణకు దిగాడు. ఈ ఘర్షణ విషయం తెలుసుకొన్న డాక్టర్ కైలాష్ చంద్ర సంఘటనస్థలానికి చేరుకొన్నారు. రోగి నూర్జన్ సింగ్ ను వేరే అంబులెన్స్ లో కాన్పూరుకు పంపారు.  మార్గమధ్యలోనే నుర్జన్ సింగ్ మరణించాడు.


 

PREV
click me!

Recommended Stories

Tamilnadu Incidnt : నిందితుడికి రెండు మరణశిక్షలు | Asianet News Telugu
Coimbatore Child Case: 10 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగితే జోకులేంటి... సస్పెండ్ చేసిన సీఎం విజయ్