యూపీలో బీజేపీ సీనియర్ నేత ఆత్మారామ్ తోమర్ అనుమానాస్పద మృతి: పోలీసుల దర్యాప్తు

By narsimha lodeFirst Published Sep 10, 2021, 4:04 PM IST
Highlights

ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మాజీ మంత్రి, సీనియర్ బీజేపీ నేత ఆత్మారామ్ తోమర్ అనుమానాస్పదస్థితిలో మరణించారు.బాగ్‌వత్ జిల్లా బారౌత్ బిజ్రాల్ రోడ్డులో ఆయన నివాసంలో గురువారంనాడు చనిపోయారు. దగ్గరి బంధువులే హత్య చేశారని కుటుంబసభ్యులు అనుమానిస్తున్నారు. ఇదే విషయమై ఫిర్యాదు చేశారు.

లక్నో: మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత ఆత్మారామ్ తోమర్ అనుమానాస్పదస్థితిలో మరణించారు. ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని బాగ్‌వత్ జిల్లా బారౌత్ బిజ్రాల్ రోడ్డులోని ఆయన నివాసంలో  గురువారం నాడు చనిపోయారు. 1997లో యూపీ  మంత్రిగా పనిచేశారు ఆత్మారామ్ తోమర్.

ఆత్మారామ్ తోమర్ మెడకు టవల్ చుట్టి ఉంది., ఆయన స్కార్పియో కారు అదృశ్యం కావడంతో  హత్యకు గురయ్యారనే అనుమానాలు బలపడుతున్నాయి.ఆత్మారామ్‌ను టవల్‌తో గొంతుకు ఉరి బిగించి చంపినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.  పోలీసులు  డాగ్ స్క్వాడ్‌తో సంఘటనా స్థలంలో పరిశీలించారు. 

మంత్రి ఇంటి తలుపు బయటి నుండి లాక్ చేసి ఉన్నట్టు జిల్లా ఎస్‌పీ నీరజ్ కుమార్ జడౌన్ తెలిపారు. ఆత్మారామ్ తోమర్ అనుమానాస్పద మృతిపై  దగ్గరి బంధువులపై కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తం చేశారు.ఈ మేరకు  పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆత్మారామ్ తోమర్  కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవాళ ఉదయం డ్రైవర్ ఆత్మారాం తోమర్  ఇంటికి వచ్చారు.ఎంతకీ తలుపులు తెరవకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు.మాజీ మంత్రి నివాసంలో బిగించిన సీసీటీవీ పుటేజీలో ఇద్దరు వ్యక్తులు ప్రవేశించినట్టుగా గుర్తించారు. ఈ ఘటనపై  ఐపీసీ 302 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఆత్మారామ్ తోమర్ మృతదేహన్ని పోస్టుమార్టం కోసం పంపారు. 1993 ఎన్నికల్లో బీజేపీ టికెట్ పై చప్రాలి అసెంబ్లీ స్థానం పోటీ చేశారు. 1997లో బీజేపీ ప్రభుత్వంలో రామ్ సహాయమంత్రిగా పనిచేశారు.


 

click me!