మాఫియా, బాహుబలులకు టికెట్లు ఇవ్వం.. అందుకే ఆయనను మార్చాం: మాయావతి సంచలనం

By Siva KodatiFirst Published Sep 10, 2021, 4:36 PM IST
Highlights

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మాఫియా లీడర్లకు, బాహుబలులకు టికెట్లు ఇచ్చేది లేదని బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి స్పష్టం చేశారు. ప్రజల ఆకాంక్షలు, అంచనాలకు అనుగుణంగా అభ్యర్థులను ఎంపిక చేసే విధంగా శ్రద్ధ వహించాలని పార్టీ ఇంచార్జీకి విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు.

వచ్చే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి సంచలన నిర్ణయం తీసుకున్నారు. మాఫియా లీడర్లకు, బాహుబలులకు టికెట్లు ఇచ్చేది లేదని ఆమె స్పష్టం చేశారు. అజమ్‌గఢ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ముఖ్తార్ అన్సారీని తప్పించి ఆ స్థానం నుంచి యూపీ బీఎస్‌పీ అధ్యక్షుడు శ్రీ భీమ్ రాజ్‌భర్ పేరును మాయావతి ఖరారు చేశారు. అనంతరం ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని తాజాగా ప్రారంభించిన మాయావతి.. ప్రజల ఆకాంక్షలు, అంచనాలకు అనుగుణంగా అభ్యర్థులను ఎంపిక చేసే విధంగా శ్రద్ధ వహించాలని పార్టీ ఇంచార్జీకి విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు.

ఈ విషయమై శుక్రవారం ఆమె తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ ‘‘రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్‌పీ నుంచి మాఫియా నేపథ్యం ఉన్నవారు బాహుబలులు ఎవరూ పోటీ చేయరని తెలిపారు. దీనిని దృష్టిలో ఉంచుకుని అజంగఢ్ నియోజకవర్గం నుంచి ముఖ్తార్ అన్సారీని తొలగించి యూపీ బీఎస్‌పీ అధ్యక్షుడు శ్రీ భీమ్ రాజ్‌భర్‌ను ఖరారు చేశామన్నారు. ప్రజల అంచనాలను చేరుకోవాడానికి పార్టీ అందుకునే విధంగా అభ్యర్థుల ఎంపిక జరగాలని పార్టీ ఇంచార్జీకి విజ్ఞప్తి చేశానని మాయావతి  వెల్లడించారు. సమస్యలు లేకుండా ఇటువంటి అంశాలపై చర్యలు తీసుకోవాలని... రాష్ట్రమే కాకుండా దేశం మొత్తం చట్టం ద్వారా నిర్మితమైన చట్టబద్ధ పాలన కావాలని బీఎస్‌పీ సంకల్పిస్తోంది. యూపీ ప్రస్తుత చిత్రాన్ని మార్చడానికి బీఎస్‌పీ కృషి చేస్తుందని మాయావతి వరుస ట్వీట్లు చేశారు.

click me!