దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జె.జయలలితకు చెందిన బంగారు ఆభరణాలను తమిళనాడు ప్రభుత్వానికి అందించనున్నారు.
చెన్నై: దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జె.జయలలితకు చెందిన 27 కిలోల బంగారం, వజ్రాభరణాలను ఈ ఏడాది మార్చి 6,7 తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వానికి అందించనున్నారు. జయలలితపై విధించిన రూ. 100 కోట్ల జరిమానాకు అవసరమైన నిధులను సమీకరించేందుకు అవసరమైన తుది న్యాయ ప్రక్రియకు నాంది పలకనున్నారు.
also read:చేతిలో చిల్లిగవ్వ లేదు, టీ కోసం డబ్బు సంపాదించారు: నెట్టింట చక్కర్లు కొడుతున్న వీడియో
టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారంగా బెంగుళూరులోని 36వ సిటీ సివిల్ కోర్టు సోమవారం నాడు ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. అవినీతి కేసులో అవినీతి కేసులో జయలలిత దోషిగా తేలింది. నాలుగేళ్ల జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే. అయితే జయలలిత మరణించి దాదాపు ఏడేళ్లు అవుతుంది.
టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం మేరకు ప్రత్యేక న్యాయ స్థానం జయలలితకు చెందిన చర,స్థిర ఆస్తులను వేలం వేయనుంది. తొలుత బంగారు ఆభరణాలను వేలం వేసిన తర్వాత ఆమె స్థిరాస్తులను వేలం వేయనున్నారు.
also read:పెళ్లి పందిరిలోనే వధువు కాళ్లు తాకిన వరుడు: సోషల్ మీడియాలో వీడియో వైరల్
20 కిలోల ఆభరణాలను విక్రయించడం లేదా వేలం వేయడం ద్వారా వచ్చిన సొమ్మును జరిమానా కింద చెల్లించనున్నారు. అయితే ఏడు కిలోల బంగారం జయలలితకు ఆమె తల్లి నుండి వారసత్వంగా వచ్చినట్టుగా పరిగణించబడుతున్నందున దీన్ని మినహాయించే అవకాశం ఉంది. జయలలిత ఖాతా ఉన్న క్యాన్ ఫిన్ హోమస్ లిమిటెడ్ సోమవారం నాడు బెంగుళూరులోని ప్రత్యేక కోర్టుకు దాదాపు రూ. 60 లక్షలను అందించినట్టుగా ఈ నివేదిక పేర్కొంది.
ప్రత్యేక న్యాయమూర్తి మోహన్ గతంలో ఆదేశించినట్టుగా విజిలెన్స్ అండ్ యాంటీ డైరెక్టరేట్ నుండి రాష్ట్ర హోం సెక్రటరీ, ఇన్స్ పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కు అధికారం ఇస్తూ తమిళనాడు ప్రభుత్వం ఫిబ్రవరి 16న జీవో జారీ చేసిందని టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది.
also read:టార్గెట్ పార్లమెంట్ ఎన్నికలు: తెలంగాణలో బీజేపీ విజయ సంకల్ప యాత్రలు
ఆభరణాలను తీసుకొనేందుకు గాను ఫోటోగ్రాఫర్, వీడియో గ్రాఫర్ తో పాటు ఆరు పెద్ద ట్రంక్ పెట్టెలను తీసుకెళ్లేందుకు అవసరమైన భద్రతతో రావాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.ఈ ఆభరణాలను తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించడానికి అవసరమైన భద్రతను ఏర్పాటు చేయాలని సిటీ సివిల్ కోర్టు రిజిస్ట్రార్ కు కోర్టు సూచించింది.
2014 సెప్టెంబర్ లో బెంగుళూరులోని ప్రత్యేక కోర్టు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జె.జయలలితకు నాలుగేళ్ల జైలు శిక్ష, రూ. 100 కోట్ల జరిమానాను విధించింది. మాజీ ముఖ్యమంత్రి జె.జయలలితతో పాటు ఎన్. శశికళ, జె. ఇళవరసి, వి.ఎన్. సుధాకరన్‌లను కూడ దోషులుగా నిర్ధారించారు. వీరికి ఒక్కొక్కరికి నాలుగేళ్ల జైలు శిక్ష, రూ. 10 కోట్ల జరిమానా విధించింది కోర్టు.
also read:డిజి-యాత్ర యాప్: ముందు వరుసలో ఢిల్లీ, బెంగుళూరు ప్రయాణీకులు
2015 మే 11న కర్ణాటక హైకోర్టు నిర్ధోషులుగా ప్రకటించింది. అయితే సుప్రీంకోర్టు మాత్రం హైకోర్టు ఉత్తర్వులను తోసిపుచ్చింది. అయితే ఏడేళ్ల క్రితం జయలలిత మరణించారు. దీంతో ఆమెపై ఉన్న అభియోగాలను రద్దు చేస్తున్నట్టుగా సుప్రీంకోర్టు పేర్కొంది. అయితే మిగిలిన ముగ్గురూ నాలుగేళ్ల శిక్షను అనుభవించి జరిమానాలు చెల్లించాల్సి వచ్చింది.