5800 మీటర్ల ఎత్తు నుండి పడిపోయిన పర్వతారోహకుడు.. అండగా నిలిచిన అదానీ..

Published : May 17, 2023, 04:31 AM IST
5800 మీటర్ల ఎత్తు నుండి పడిపోయిన పర్వతారోహకుడు.. అండగా నిలిచిన అదానీ..

సారాంశం

భారత పర్వతారోహకుడు అనురాగ్ కు ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ అండగా నిలిచారు. అతడి కోసం ప్రత్యేకంగా ఎయిర్ అంబులెన్స్ ఏర్పాటు చేసి ఢిల్లీకి తరలించారు. 

నేపాల్ లోని అన్నపూర్ణ పర్వతాన్ని అధిరోహిస్తూ పర్వతారోహకుడు అనురాగ్ మాలూ ప్రమాదవశాత్తు పర్వతాల్లోని లోతైన పగుళ్లలో పడిపోయారు. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న అనురాగ్ కు ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ అండగా నిలిచారు. అతడి కోసం ప్రత్యేకంగా ఎయిర్ అంబులెన్స్ ఏర్పాటు చేసి ఢిల్లీకి తరలించారు. సకాలంలో సహాయం చేయడానికి అదానీ ఫౌండేషన్ కు అనురాగ్ మాలూ సోదరుడు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ తరుణంలో గౌతమ్ అదానీకి అతని సోదరుడు ఆశిష్ మాలు ట్విట్టర్ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. "సకాలంలో ఎయిర్‌లిఫ్టింగ్ చేసినందుకు నేను మాటల్లో చెప్పలేనంత కృతజ్ఞుడను. అనురాగ్ మాలూను సురక్షితంగా తిరిగి తీసుకురావడంలో అమూల్యమైన సహాయం చేసిన గౌతం అదానీ , అదానీ ఫౌండేషన్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు" అని ఆయన ట్వీట్ చేశారు.


రాజస్థాన్ కిషన్‌గఢ్‌కు చెందిన అనురాగ్ మాలూ ఏప్రిల్ 17న అన్నపూర్ణ పర్వతంపై క్యాంప్ III నుండి దిగుతుండగా.. 5800 మీటర్ల ఎత్తు నుంచి పడిపోయి తప్పిపోయాడు. అన్నపూర్ణ పర్వతంపై కష్టతర వాతావరణ ఉంది. అతడిని మూడు రోజుల తర్వాత ఏప్రిల్ 20న గుర్తించారు. దీంతో అతడ్ని రక్షించి సమీపంలోని వైద్య శిబిరానికి  తరలించారు. అయితే.. పరిస్థితి విషమంగా ఉండటంతో నేపాల్ లోని పోఖారాలోని మణిపాల్ ఆస్పత్రికి అక్కడ నుంచి ఖాట్మండులోని మెడిసిటీ ఆసుపత్రికి తరలించారు.

నేపాల్ నుంచి భారతదేశానికి ఎయిర్ లిఫ్ట్ చేయడానికి తమ వద్ద అందుకు అవసరమయ్యే డబ్బు లేదని, ఆదుకోవాలని అనురాగ్ మాలు కుటుంబం సహాయం కోరింది. ఈ క్రమంలో అనురాగ్ మాలు కుటుంబం అదానీ ఫౌండేషన్ నుండి సహాయం కోరింది. మాలును నేపాల్ నుండి భారతదేశానికి విమానంలో తరలించాలని, భూమి బదిలీ ఖర్చులను ఏర్పాటు చేయాలని కుటుంబం విజ్ఞప్తి చేసింది. అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు , చైర్మన్ గౌతమ్ అదానీ కుటుంబం విజ్ఞప్తిపై వెంటనే చర్య తీసుకున్నారు.

దీని తర్వాత అదానీ ఫౌండేషన్ అనురాగ్ మాలు కోసం ఎయిర్ అంబులెన్స్ ఏర్పాటు చేసి.. మాలూను ఖాట్మాండు నుంచి ఢిల్లీకి తరలించారు. ప్రస్తుతం అతడిని న్యూ ఢిల్లీలోని ఆల్-ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)కి తరలించారు. ప్రస్తుతం అతడికి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. అదానీ ఫౌండేషన్ కు గౌతమ్ అదానీ భార్య ప్రీతీ చీఫ్ గా ఉన్నారు. గాయపడిన పర్వతారోహకుడికి సహాయం అందించడం తన భార్యకు దొరికిన గొప్ప అవకాశం అదానీ అని కొనియాడారు. అనురాగ్ మాలూ త్వరగా కోలుకోవాలని, కొత్త జీవితాన్ని ప్రార్థిస్తాడని  అన్నారు.

PREV
click me!

Recommended Stories

Assembly Building Shines in Tricolour Laser Lights | Republic Day Celebrations | Asianet News Telugu
Top 5 South Indian dishes : ప్రాంతాల పేర్లతో ప్రపంచానికి పరిచయమైన దక్షిణాది వంటకాలు ఇవే..!