మంటల్లో చిక్కుకున్న గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్.. బీహార్‌లోని ముజఫర్‌పూర్ జంక్షన్ వద్ద ఘటన..

Published : Mar 24, 2023, 04:40 PM IST
మంటల్లో చిక్కుకున్న గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్.. బీహార్‌లోని ముజఫర్‌పూర్ జంక్షన్ వద్ద ఘటన..

సారాంశం

గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్‌లో శుక్రవారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించింది. రైలు బీహార్‌లోని ముజఫర్‌పూర్ జంక్షన్‌లో ప్లాట్‌ఫారమ్‌పైకి చేరుకున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వెంటనే అగ్నిమాపక సిబ్బంది, రైల్వే అధికారులు అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. 

బీహార్‌లోని ముజఫర్‌పూర్ జంక్షన్‌లో ఆగిన గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రైలులోని జీ-15 ఏసీ కంపార్ట్‌మెంట్‌లో ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. రైలు బోగీ నుంచి పొగలు రావడంతో ప్లాట్‌ఫాంపై కలకలం రేగింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే రైల్వే అధికారులు, సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. వెంటనే మంటలను అదుపు చేయడంలో నిమగ్నమయ్యారు.

రాహుల్‌పై అనర్హత వేటు: ఈరోజు రాజ్యాంగ ప్రజాస్వామ్యం కొత్త పతానాన్ని చూశాం.. బీజేపీపై మమత ఫైర్

మంటలు చెలరేగడం గమనించిన రైల్వే సిబ్బంది దెబ్బతిన్న బోగీని మరో బోగీ నుంచి కోసి వేరు చేశారు. దాదాపు 25 నిమిషాల తర్వాత మంటలు అదుపులోకి వచ్చాయి. ప్లాట్‌ఫారమ్‌పై ఉన్న ప్రయాణికులు ప్రశాంతంగా ఉండాలని, ప్రస్తుతం పరిస్థితి అంతా మామూలుగానే ఉందని సూచించారు. ఎవరూ ఆందోళన చెందకూడదని కోరారు.

ప్లాట్‌ఫారమ్‌పై ఉన్న ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం.. 12211 ముజఫర్‌పూర్ - ఆనంద్ విహార్ గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ జంక్షన్‌లోని ప్లాట్‌ఫారమ్ నంబర్ 2పై యార్డ్ నుండి బయటకు వచ్చింది. మధ్యాహ్నం 3.15 గంటలకు రైలు బయలుదేరేందుకు సిద్ధమవుతోంది. ఢిల్లీ వెళ్లే ప్రయాణికులు కూడా ప్లాట్‌ఫారమ్‌పైకి చేరుకోవడం ప్రారంభించారు. ఇంతలో జీ 15 బోగీ నుంచి ఒక్కసారిగా పొగలు రావడం మొదలైంది. దీంతో బోగీలో ఉన్న ప్రయాణికులు బయటకు వచ్చారు. ఏసీ బోగీలోని కప్లర్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయని పేర్కొన్నారు. 

రాహుల్ గాంధీపై అనర్హత వేటుపై కాంగ్రెస్ రియాక్షన్.. ‘ఆ అధికారం లోక్‌సభ సెక్రెటేరియట్‌కు ఉండదు’

అయితే ఈ మంటల వల్ల ఎలాంటి నష్టం వాటిల్లినట్లు ఇప్పటి వరకు సమాచారం లేదు. అయితే ఈ ఘటన తర్వాత ముజఫర్‌పూర్ జంక్షన్ నుండి రైలు కొంత ఆలస్యంగా ఢిల్లీలోని ఆనంద్ విహార్ జంక్షన్‌కు బయలుదేరింది. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

ఏమిటీ..! కేవలం పశువుల పేడతో రూ.500 కోట్ల లాభమా..!!
Sabarimala Makarajyothi: మకర జ్యోతి దర్శనానికి శబరిమలకు పోటెత్తిన భక్తులు | Asianet News Telugu