వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో చెత్త.. ట్రైన్‌లో ప్లాస్టిక్ వ్యర్థాల ఫొటో వైరల్.. మండిపడుతున్న నెటిజన్లు

Published : Jan 29, 2023, 05:25 AM IST
వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో చెత్త.. ట్రైన్‌లో ప్లాస్టిక్ వ్యర్థాల ఫొటో వైరల్.. మండిపడుతున్న నెటిజన్లు

సారాంశం

వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్లాస్టిక్ వ్యర్థాలతో ఉన్న చిత్రపటాన్ని నెటిజన్లు వైరల్ చేశారు. మన దేశ పౌరులకు బాధ్యతలు తెలియని, కానీ, వారి హక్కుల గురించి స్పష్టంగా తెలుస్తుందని పౌరులపై కామెంట్ చేశారు.  

న్యూఢిల్లీ: వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లను ఇటీవలే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రస్తుతం అందుబాటులో ఉన్న ట్రైన్‌లలో అన్నింటికంటే అధునాతనమైనది. ఈ ట్రైన్ టికెట్ ధర కూడా అలాగే.. ఎక్కువగా ఉన్నది. ఈ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ పై దేశవ్యాప్తంగా మంచి చర్చ జరుగుతున్నది. తాజాగా, ఇందులో ఇబ్బంది కలిగించే చర్చ కూడా చేరుతున్నది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో ఎక్కడపడితే ఇష్టారీతన ప్లాస్టిక్ వ్యర్థాలను ప్రయాణికులు విడిచిపెట్టి వెళ్లారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఐఏఎస్ అధికారి అవనీష్ శరణ్ ఈ ఫొటోలను ట్వీట్ చేశారు. ఖాళీ వాటర్ బాటిల్స్, వాడిన ఫుడ్ కంటెయినర్లు, ప్లాస్టిక్ బ్యాగ్‌లు, చెత్తా చెదారం చెల్లాచెదురై పడి ఉన్నాయి. ఓ వర్కర్ చేత చీపురు పట్టుకుని క్లీన్ చేయడానికి వస్తున్నట్టు ఉన్నాడు. ఈ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. 

Also Read: తెలంగాణకు మరో మూడు వందే భారత్ రైళ్లు.. మూడు కీలక నగరాలకు తగ్గనున్న ప్రయాణ సమయం

ఈ ఫొటోపై నెటిజన్ల నుంచి ఘోరమైన స్పందన వస్తు్న్నది. సార్.. మన దేశంలో ప్రజలకు వారి బాధ్యతలేవీ తెలియకున్నా.. హక్కులు మాత్రం కచ్చితంగా తెలుసుకుని ఉంటారని వివరించారు. పరిసరాలను అశుభ్రపచడం కాదు.. పరిశుభ్రతకు తమ వంతుగా పాటుపడాలని ఓ యూజర్ అన్నారు. మెరుగైన వసతులు, మౌలిక సదుపాయాల కోసం ప్రభుత్వంపై డిమాండ్ చేస్తూనే ఉంటామని, కానీ, మన దేశ ప్రజలకు ఎలా నీట్‌గా ఉండాలో, ఎలా జాగ్రత్తలు తీసుకోవాలో తెలియదు అని పేర్కొన్నారు. 

అసలు బాధ్యతనే అర్థం చేసుకోనంత కాలం ఏదీ మారదని వివరించారు. దేశ ఆరోగాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Republic Day Parade: ఘనంగా గణతంత్ర దినోత్సవ పరేడ్ సన్నాహాలు| Asianet News Telugu
Fresh Snowfall in Shimla Delights Tourists: రికార్డు స్థాయిలో సిమ్లాలో మంచు వర్షం| Asianet Telugu