హర్యానాలో ఓ మహిళ బస్సులో ప్రయాణిస్తూ ప్రసవించింది. మార్గం మధ్యలోనే ఆమెకు పురిటినొప్పులు రావడంతో బస్సులోని కొందరు మహిళలు ఆమె ప్రసవించేలా సహాయపడ్డారు. అయితే, నెలలు నిండకముందే శిశువును కనడంతో ఆ నవజాత శిశువు మరణించింది. డ్రైవర్ నేరుగా బస్సును హాస్పిటల్ తీసుకెళ్లారు. శిశువు మరణించిందని వెల్లడించిన వైద్యులు ఆమెను హాస్పిటల్‌లో అడ్మిట్ చేసుకుని చికిత్స అందిస్తున్నారు.
అంబాలా: హర్యానా రోడ్‌వేస్ బస్సులో ఓ మహిళ ప్రసవించింది. అంబాలా నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ముల్లానా సమీపంలో ఆమె ప్రసవించింది. నెలలు నిండకుండానే శిశువుకు జన్మనిచ్చింది. ఆ శిశువు మరణించింది. ఆ మహిళను హాస్పిటల్‌లో చేర్చారు. నెలలు నిండకుండా జన్మించడం వల్ల ఆ శిశువు మరణించినట్టు వైద్యులు తెలిపారు.
ఆ గర్భిణి తన భర్త, ఇద్దరు పిల్లలు, మరో బంధువుతో కలిసి బస్సు ఎక్కినట్టు బస్సు డ్రైవర్ సలీమ్ ఖాన్ తెలిపారు. అంబాలా నుంచి సహరన్‌పూర్ వెళ్లడానికి బయల్దేరారు. అయితే, మార్గం మధ్యలోనే ఆ గర్భిణికి పురిటి నొప్పులు వచ్చాయని వివరించారు. ముల్లానాకు చేరగానే ఆమె నొప్పులు పెరిగాయని తెలిపారు.
బస్సులోని కొందరు మహిళలు ఆమెకు ప్రసవం జరిగేలా చూశారని అధికారులు తెలిపారు. బస్సు డ్రైవర్ ఆ బస్సును ముల్లానాలోని సివిల్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అప్పటికే ఆమె ప్రసవించింది. హాస్పిటల్ చేరేలోపే శిశువు మరణించింది. శిశువు మరణించిందని వైద్యులు డిక్లేర్ చేశారు. ఆమెను హాస్పిటల్‌లో అడ్మిట్ చేసుకున్నారు. ఆ మహిళ నెలలు నిండకముందే ప్రసవించిందని వైద్యులు తెలిపారు.