పోలీసుల కళ్లలో కారం కొట్టి.. గ్యాంగ్ స్టర్ కుల్దీప్ జగినాను కాల్చి చంపిన క్రిమినల్స్..

Published : Jul 12, 2023, 02:07 PM IST
పోలీసుల కళ్లలో కారం కొట్టి.. గ్యాంగ్ స్టర్ కుల్దీప్ జగినాను కాల్చి చంపిన క్రిమినల్స్..

సారాంశం

ఉత్తరప్రదేశ్ లో గ్యాంగ్ స్టర్ - పొలిటీషియన్ అతిక్ అహ్మద్, అతడి సోదరుడు అష్రఫ్ అజీమ్ ను కాల్చి చంపిన విధంగానే రాజస్థాన్ లోనూ అలాంటి ఘటనే జరిగింది. కుల్దీప్ జగినా అనే గ్యాంగ్ స్టర్ ను పలువురు దుండగులు కాల్చి చంపారు. పోలీసుల కళ్లలో కారం కొట్టి ఈ చర్యకు ఒడిగట్టారు.

ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఓ గ్యాంగ్ స్టర్ ను పలువురు నేరగాళ్లు కాల్చి చంపారు. ఈ ఘటన రాజస్థాన్ లో చోటు చేసుకుంది. ఆ నిందితుడు పోలీసుల కస్టడీలో ఉన్నప్పుడే ఈ కాల్పులు జరగడం గమనార్హం. పోలీసుల కళ్లలో కారం కొట్టి మరీ దుండగులు ఈ దారుణానికి పాల్పడ్డారు.

బెంగళూరు ఎయిర్ పోర్టులో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్‌.. రన్ వేపై దొర్లుతూ వెళ్లడంతో.. వీడియో వైరల్

‘ఇండియా టుడే’కథనం ప్రకారం.. రాజస్థాన్ కు చెందిన కుల్దీప్ జగినా ఓ గ్యాంగ్ స్టర్. అతడిని ఓ హత్య కేసులో కొంత కాలం కిందట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడు ప్రస్తుతం జైపూర్ జైలులో ఖైదీగా ఉన్నాడు. కాగా.. అతడిని పోలీసులు బుధవారం భరత్ పూర్ కోర్టుకు తీసుకెళ్లాల్సి వచ్చింది. 

దీని కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. ఆ గ్యాంగ్ స్టర్ ను పోలీసులు ఓ వాహనంలో ఎక్కించుకొని భరత్ పూర్ కోర్టుకు బయలుదేరారు. ఈ క్రమంలో ఆ వాహనం జైపూర్-ఆగ్రా జాతీయ రహదారిపై అమోలి టోల్ ప్లాజా వద్దకు చేరుకుంది. దీనినే అదనుగా చేసుకున్న పలువురు దుండగులు వెంటనే అక్కడికి చేరుకొని పోలీసుల కళ్లలో కారం పొడి చల్లారు. 

మహారాష్ట్రలో దారుణం.. గొర్రెల మందపైకి వేగంగా దూసుకెళ్లిన ట్రక్కు.. టైర్ల కింద నలిగి చనిపోయిన జీవాలు..

ఒక్క సారిగా జరిగిన ఈ పరిణామంతో పోలీసులు ఏమీ అర్థం కాలేదు. వారు కళ్ల మంటలతో అల్లాడుతున్న సమయాన్ని ఆసరాగా చేసుకున్న ఆ దుండగులు గ్యాంగ్ స్టర్ కుల్దీప్ జగినాను కాల్చి చంపారు. ఈ ఘటన  జిల్లా కేంద్రానికి 40 కిలోమీటర్ల దూరంలో జరిగింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?