గ్యాంగ్ రేప్ చేసి.. పెళ్లి చేసుకోమని బెదిరింపులు

By ramya neerukondaFirst Published Jan 4, 2019, 12:45 PM IST
Highlights

ఫేస్ బుక్ ఫ్రెండ్ కదా అని కలవడానికి వెళ్తే.. తన సోదరులతో కలిసి గ్యాంగ్ రేప్ చేశాడు. అనంతరం బలవంతంగా పెళ్లి చేసుకోవాలంటూ బెదిరించడం మొదలుపెట్టారు.


ఫేస్ బుక్ ఫ్రెండ్ కదా అని కలవడానికి వెళ్తే.. తన సోదరులతో కలిసి గ్యాంగ్ రేప్ చేశాడు. అనంతరం బలవంతంగా పెళ్లి చేసుకోవాలంటూ బెదిరించారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం షమిలి జిల్లాకు చెందిన 23ఏళ్ల యువతికి కొద్ది రోజుల క్రితం ఫేస్ బుక్ లో ఓ యువకుడు పరిచమయ్యాడు. రోజూ ఫేస్ బుక్ లో మెసేజ్ లు చేసుకునేవారు. ఈ క్రమంలో ఒక రోజు కలవాలంటూ ఆ యువకుడు యువతికి మెసేజ్ చేశాడు. దీంతో.. ఆ యువతి గురువారం అతినిని కలవడానికి అతను చెప్పిన ప్రాంతానికి వెళ్లింది.

ఆమెను కలుసుకున్న ఆ యువకుడు.. అక్కడి నుంచి ఆమెకు మాయమాటలు చెప్పి ఓ హోటల్ కి తీసుకువెళ్లాడు. హోటల్ గదిలోకి వెళ్లిన తర్వాత.. ఆమె పై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం అతని సోదరులు ఫ్రెండ్స్.. దాదాపు పది మంది ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. దానంతటినీ మొబైల్ ఫోన్ లో వీడియో కూడా తీశారు.

అనతంరం ఆ వీడియో చూపిస్తూ.. యువతిని బ్లాక్ మొయిల్ చేయడం మొదలుపెట్టారు. తనను పెళ్లి చేసుకోవాలని లేదంటూ వీడియోని సోషల్ మీడియాలో పెడతామంటూ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. దీంతో.. బాధితురాలను పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులు పది మందిని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

click me!