
మహారాష్ట్రలో సామాజిక శాంతికి విఘాతం కలిగించడానికి, ఓటర్లను పోలరైజ్ చేయడానికి అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ‘అల్లర్ల ప్రయోగశాల’ను ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తోందని ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యుబీటీ) బుధవారం ఆరోపించింది. ఆ పార్టీ పత్రిక అయిన ‘సామ్నా’ సంపాదకీయంలో.. మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి శివసేనను విచ్ఛిన్నం చేసినట్లే.. వారు (బీజేపీ) సమాజాన్ని విభజించి ఎన్నికలను ఎదుర్కోవాలనుకుంటున్నారని పేర్కొంది. గత సంవత్సరం శివసేనలో చీలికను ప్రస్తావిస్తూ.. ఏక్ నాథ్ షిండే బీజేపీ మద్దతుతో సీఎం అయ్యారని తెలిపింది.
కేరళలో 64,000 మంది మాత్రమే నిరుపేదలు - సీఎం పినరయి విజయన్
రాజ్యాంగాన్ని, జాతీయ ఐక్యతను, మత సహజీవనాన్ని పక్కనపెట్టి.. అధికారం కోసం ఆరాటపడే వారు చుట్టుముట్టారని, కాబట్టి రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఆ సంపాదకీయం పేర్కొంది. ఏక్ నాథ్ షిండే-దేవేంద్ర ఫడ్నవీస్ సంకీర్ణం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో మతపరమైన, సామాజిక ఉద్రిక్తతలు నెలకొన్నాయని ఆరోపించింది.
మహారాష్ట్రలో బీజేపీ, దాని మద్దతుదారులు అల్లర్ల ప్రయోగశాలను ఏర్పాటు చేయడం ద్వారా సామాజిక శాంతికి విఘాతం కలిగించడానికి, ఓటర్లను పోలరైజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని పేర్కొంది. కొన్ని సమస్యలను అవగాహన ద్వారా పరిష్కరించుకోవచ్చని, కానీ శివసేనను చీల్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్టుగానే, సమాజాన్ని చీల్చి ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నారని తెలిపింది. ఇటీవల అకోలా, షెవ్గావ్, నాసిక్ లో జరిగిన ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొంది.
సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తూ.. విష వాయువులు పీల్చి ఇద్దరు మృతి..
రాజకీయ దురుద్దేశంతో సామాజిక ఉద్రిక్తతలను ఉద్దేశపూర్వకంగా సృష్టిస్తున్నారని, ఇది ఒక క్రమపద్ధతిలో, ప్రణాళికాబద్ధంగా జరుగుతోందని సంపాదకీయం ఆరోపించింది. సూత్రధారులను బయటపెడతానని ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పారని, అయినా ఇంకా ఏమీ జరగలేదని తెలిపింది.
అతిక్ అహ్మద్ తరహాలోనే.. యూపీ కోర్టులో ఇద్దరు హత్యా నిందితులపై దుండగుల కాల్పులు..
కాగా.. మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాలోని అకోలా నగరం, షెవ్ గావ్ గ్రామాల్లో శని, ఆదివారాల్లో జరిగిన మత ఘర్షణలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘర్షణల్లో ఒకరు మృతి చెందగా, 13 మంది గాయపడ్డారు. మరో ఘటనలో నాసిక్ జిల్లాలోని ప్రసిద్ధ త్రయంబకేశ్వర్ ఆలయంలోకి ముస్లిం మతానికి చెందిన యువకులు బలవంతంగా ప్రవేశించడానికి ప్రయత్నించారు. దీంతో సెక్యూరిటీ సిబ్బంది వారిని అడ్డుకున్నారు. అనంతరం ఆలయ నిర్వాహకులు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని, అరెస్టు చేశారు. అయితే ఈ ఘటనై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయడానికి మహారాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది.