మళ్లీ ఇంధన వడ్డన.. పెరిగిన డీజిల్ రేట్లు.. హైదరాబాద్‌లో ధరలు ఇలా..

Published : Sep 26, 2021, 01:11 PM ISTUpdated : Sep 26, 2021, 01:12 PM IST
మళ్లీ ఇంధన వడ్డన.. పెరిగిన డీజిల్ రేట్లు.. హైదరాబాద్‌లో ధరలు ఇలా..

సారాంశం

ఇంధన ధరలు సాధారణ పౌరులకు పెనుభారంగా మారుతున్నాయి. ఇప్పటికే పెట్రోల్ ధర సెంచరీని దాటేయగా, డీజిల్ కూడా అదే దారిలో ఉన్నది. తాజాగా, దేశవ్యాప్తంగా డీజిల్ రేట్లు మరోసారి పెరిగాయి. లీటర్ డీజిల్‌పై 25 పైసలు పెరిగినట్టు చమురు సంస్థలు వెల్లడించాయి. పెట్రోల్ ధరలు మాత్రం మారలేదని వివరించాయి.  

న్యూఢిల్లీ: చమురు(Oil) ధరలు(Rates) మళ్లీ పెరిగాయి. దేశవ్యాప్తంగా డీజిల్(Diesel) ధరలు పెరిగాయి. కాగా, పెట్రోల్(Petrol) ధరల్లో మార్పుల్లేవు. ఈ నెలలో మూడు వారాల తర్వాత డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి(Hike). తాజాగా, లీటర్ డీజిల్‌పై 25 పైసలు పెరిగాయి. దీంతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 89.07, ఢిల్లీలో రూ. 96.68గా మారాయి. పెట్రోల్ ధర మాత్రం స్థిరంగా ఉన్నది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 101.19, ముంబయిలో రూ. 107.26గా ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరగడం వల్లే ఈ ధరలు పెరిగాయి.

ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్తాన్ పెట్రోలియం కంపెనీలు సాధారణంగా రోజువారీగా చమురు ధరలను సవరిస్తుంటాయి. కానీ, గత మూడు వారాలుగా ధరల్లో మార్పు లేదు. మళ్లీ ఈ సవరణల కారణంగా ఈ నెల 24న డీజిల్ ధర పెరిగింది. అప్పుడూ పెట్రోల్ ధర పెరగలేదు. ఈ నెల 24న డీజిల్ ధర లీటర్‌పై 24 పైసలు పెరిగింది.

హైదరాబాద్‌లో చమురు ధరలు ఇలా ఉన్నాయి. ఈ నెల 25 వరకు రాజధానిలో లీటర్ డీజిల్‌కు రూ. 96.92 ఉండగా, పెరిగిన ధరలతో లీటర్ డీజిల్ ధర 43 పైసలు పెరిగి రూ. 97.35కు చేరింది.

PREV
click me!

Recommended Stories

Most Expensive Things: ఇండియన్స్ సృష్టించిన అత్యంత ఖరీదైన అద్భుతాలు ఏంటో తెలుసా?
Republic Day Parade: ఘనంగా గణతంత్ర దినోత్సవ పరేడ్ సన్నాహాలు| Asianet News Telugu