యూపీలో అనూహ్య రాజకీయ పరిణామాలు.. నేడు క్యాబినెట్ విస్తరణ.. ఏడుగురు మంత్రుల ప్రమాణ స్వీకారం!

Published : Sep 26, 2021, 02:45 PM IST
యూపీలో అనూహ్య రాజకీయ పరిణామాలు.. నేడు క్యాబినెట్ విస్తరణ.. ఏడుగురు మంత్రుల ప్రమాణ స్వీకారం!

సారాంశం

యోగి ఆదిత్యానాథ్ ఈ రోజు తన మంత్రిమండలిని విస్తరించనున్నారు. కనీసం ఏడుగురు కొత్తమంత్రులను క్యాబినెట్‌లోకి తీసుకోనున్నట్టు తెలిసింది. వీరి ప్రమాణ స్వీకారం కూడా ఈ రోజే సాయంత్రం 5.30 గంటలకు జరగనున్నట్టు సమాచారం. ఇప్పటికి ప్రాతినిధ్యం లేని సామాజిక వర్గాలు, పార్టీలకు తాజా విస్తరణలో అవకాశమివ్వనున్నట్టు తెలుస్తున్నది. వచ్చే ఏడాది తొలినాళ్లలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో బీజేపీ ప్రభుత్వం ఈ విస్తరణ చేయనుంది.

లక్నో: వచ్చే ఏడాది తొలినాళ్లలో అసెంబ్లీ ఎన్నికలు(Assembly Election) జరగనుండటంతో పలురాష్ట్రాల్లో అనూహ్య రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. బీజేపీ(BJP) ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఉత్తరప్రదేశ్‌(Uttar pradesh)లోనూ ఈ మార్పులు జరుగనున్నాయి. యోగి ఆదిత్యానాథ్(Yogi Adityanath) ఈ రోజు మంత్రిమండలి(Cabinet) విస్తరణ(Expansion) చేపట్టనున్నట్టు సమాచారం. కనీసం ఏడుగురికి క్యాబినెట్‌లో చోటు ఇవ్వనున్నట్టు తెలిసింది. అంతేకాదు, ఇవాలే ప్రమాణ స్వీకారం(Oath) చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర గవర్నర్ ఆనందీబెన్ పటేల్ లక్నోకు ప్రయాణమవుతున్నారు. లక్నోలోని రాజ్‌భవన్‌లో ఆమె నూతన మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ రోజు సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండనున్నట్టు సమాచారం.

కొత్తగా క్యాబినెట్‌లో దక్కించుకునే అవకాశమున్నవారి పేర్లు రాజకీయవర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. సంగీతా బింద్, జితిన్ ప్రసాదా, ఛత్రపాల్ గంగ్వార్, పల్టురాం, దినేశ్ ఖాతిక్, క్రిష్ణ పాశ్వాన్‌లు మంత్రిమండలి విస్తరణలో భాగంగా చోటు దక్కించుకోనున్నట్టు తెలిసింది.

మంత్రిమండలి విస్తరణ ఇప్పటికి క్యాబినెట్‌లో ప్రాతినిధ్యానికి నోచుకోని సామాజికవర్గాలు, రాజకీయ పార్టీలకు అవకాశం ఇవ్వనున్నట్టు సమాచారం.

ఇటీవలే పశ్చిమ బెంగాల్‌లో అతిరధమహారధులతో ప్రచారం చేసినా పార్టీ ఓడిపోయింది. వీలైనన్ని రీతుల్లో ప్రచారం చేసినా నెట్టుకురాలేకపోయింది. దీంతో ఉత్తరప్రదేశ్‌పై బీజేపీ మొత్తం ఫోకస్ పెట్టింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీ మెజార్టీ సాధించాలన్న ఉత్తరప్రదేశ్ కీలకమైన రాష్ట్రంగా ఉన్నది. ఎందుకంటే అత్యధిక ఎంపీ స్థానాలు ఈ రాష్ట్రంలోనే ఉన్నాయి. ఇప్పటికే బీజేపీ యూపీ నుంచి 84 ఎంపీలను కలిగి ఉన్నది. 62 లోక్‌సభలో, 22 మంది రాజ్యసభలో ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంతేకాదు, బీజేపీ మిత్రపక్షం అప్నా దళ్‌కు మరో రెండు ఎంపీ స్థానాలున్నాయి. 

PREV
click me!

Recommended Stories

Nuclear Devices in Himalayas : నెహ్రూ, ఇందిరాలే ప్రస్తుత ప్రకృతి విపత్తులకు కారణమా..?
Nitin Nabin : బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మోదీ నమ్మిన బంటు.. ఎవరీ నితిన్ నబిన్?