భావ ప్రకటనా స్వేచ్ఛ విద్వేషపూరిత ప్రసంగంగా మారకూడదు - సనాతన ధర్మం వివాదంపై మద్రాస్ హైకోర్టు

భావ ప్రకటనా స్వేచ్ఛ ప్రాథమిక హక్కు అయినప్పటికీ దానిని విద్వేషపూరిత ప్రసంగాలుగా మార్చకూడదని మద్రాసు హైకోర్టు పేర్కొంది. సనాతన ధర్మం వివాదంపై దాఖలైన కేసు విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. భావ ప్రకటన స్వేచ్చ హక్కు వల్ల ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపింది.

Freedom of expression should not turn into hate speech - Madras High Court on Sanatana Dharma controversy..ISR

తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన చేసిన వ్యాఖ్యల వల్ల సనాతన ధర్మంపై దేశ వ్యాప్తంగా చర్చ కొనసాగుతోంది. అనేక వర్గాల నుంచి భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొందరు ఉదయనిధిని సమర్థిస్తూ మాట్లాడితే.. మరి కొందరు ఆయనను వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సనాతన ధర్మం అనేది దేశం పట్ల, రాజు పట్ల, తల్లిదండ్రుల పట్ల, గురువుల పట్ల, పేదల పట్ల శ్రద్ధతో సహా నిత్య కర్తవ్యాల సమాహారమని కోర్టు నొక్కి చెప్పిందని ‘ఇండియా టుడే’ పేర్కొంది.

ఔరంగాబాద్, ఉస్మానాబాద్ జిల్లాల పేర్లు మార్చిన మహా సర్కార్.. ఇక నుంచి వాటిని ఏమని పిలవాలంటే ?

Latest Videos

ఈ వివాదానికి సంబంధించిన కేసును విచారించిన జస్టిస్ ఎన్ శేషసాయి..  సనాతన ధర్మం కేవలం కులతత్వాన్ని, అంటరానితనాన్ని ప్రోత్సహించడమేనన్న భావన బలపడిందని, ఈ భావనను తాను గట్టిగా తిరస్కరించానని ఆయన పేర్కొన్నారు. సమాన పౌరులున్న దేశంలో అంటరానితనాన్ని సహించలేమని తెలిపారు. 'సనాతన ధర్మం' సూత్రాలకు లోబడి ఎక్కడో ఒకచోట అనుమతించినప్పటికీ, రాజ్యాంగంలోని ఆర్టికల్ 17 అంటరానితనాన్ని రద్దు చేసినట్లు ప్రకటించినందున అది ఇంకా ఉండటానికి స్థలం లేదని తెలిపారు.  

భావ ప్రకటనా స్వేచ్ఛ ప్రాథమిక హక్కు అయినప్పటికీ, అది విద్వేషపూరిత ప్రసంగాలుగా మారకూడదని సూచించారు. ముఖ్యంగా మతానికి సంబంధించిన విషయాలకు సంబంధించిన విషయాల్లో అలా జరగకూడదని న్యాయమూర్తి నొక్కి చెప్పారు. ఇలాంటి ప్రసంగాల వల్ల ఎవరూ గాయపడకుండా చూడాల్సిన అవసరం ఉందని తెలిపారు.

పట్టాలెక్కనున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ స్లీపర్ వెర్షన్.. ఎప్పటి నుంచి అంటే ?

ప్రతీ మతం విశ్వాసంపై ఆధారపడి ఉంటుందని, విశ్వాసం సహజంగా అహేతుకతకు లోనవుతుందని జస్టిస్ శేషసాయి అన్నారు. కాబట్టి మతానికి సంబంధించిన విషయాల్లో భావ ప్రకటనా స్వేచ్ఛను వినియోగించినప్పుడు ఎవరికీ మనో భావాలు దెబ్బతినకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. మరో మాటలో చెప్పాలంటే, భావ ప్రకటనా స్వేచ్ఛ విద్వేషపూరిత ప్రసంగం కాజాలదని పేర్కొన్నారు. ఇటీవల సనాతన ధర్మాన్ని తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులతో పోల్చారు. దానిని అరికట్టాల్సి ఉందని తెలిపారు. ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారన్నే రేపాయి.

vuukle one pixel image
click me!