నాలుగేళ్ల బాలికపై పక్కింటి వ్యక్తి లైంగిక వేధింపులు.. అరెస్టు...

By SumaBala Bukka  |  First Published Sep 26, 2023, 12:09 PM IST

గ్రేటర్ నోయిడాలో నాలుగేళ్ల బాలికపై ఒక వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. తోటలో దాక్కున్న అతడిని ఎదురుకాల్పుల తరువాత  పోలీసులు అరెస్టు చేశారు.


ఉత్తరప్రదేశ్‌ : ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో దారుణ ఘటన వెలుగు చూసింది. నాలుగు సంవత్సరాల బాలికపై  సోమవారం ఆమె పొరుగున నివసిస్తున్నవ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌ లోని జేవార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామంలో జరిగింది. ఈ ఘటన వెలుగు చూడడంతో వెంటనే రంగంలోకిదిగిన పోలీసులు నిందితుడిని (40)అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. 

నాలుగేళ్ల చిన్నారికి మాయమాటలు చెప్పి నిందితుడు ఆమెను తన ఇంటికి రప్పించాడని, ఆ తరువాత ఆ చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడని బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడని పోలీసులు తెలిపారు. భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ 376 (రేప్), లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టంలోని నిబంధనల ప్రకారం స్థానిక పోలీసు స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయబడిందని అధికారి తెలిపారు.

Latest Videos

డాక్టర్ నిర్లక్ష్యం.. పడుకోవడానికి ఏసీ వేసుకోవడంతో.. చలికి తట్టుకోలేక ఇద్దరు నవజాత శిశువులు మృతి..

నిందితుడిని పట్టుకునేందుకు పలు పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు అదనపు డీసీపీ (గ్రేటర్ నోయిడా) అశోక్ కుమార్ తెలిపారు. "రాత్రి 8.30 గంటలకు, నిందితుడు ఒక తోటలో దాక్కున్నాడని మాకు సమాచారం అందింది. దీంతో పోలీసు బృందం తోటను చుట్టుముట్టాం. లొంగిపోవాలని విజ్ఞప్తి చేశాం. కానీ, నిందితుడు వారిపై కాల్పులు జరిపాడు" అని కుమార్ చెప్పారు.

పోలీసు బృందం ఆత్మరక్షణ కోసం ప్రతీకారంగా కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో నిందితుడి కాలికి గాయం అయ్యింది. వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు ఆయన తెలిపారు. నిందితుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించి తదుపరి చట్టపరమైన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

click me!