నాలుగేళ్ల చిన్నారి కళ్లు పీకేసి సజీవ దహనం.. క్షుద్ర పూజలకోసమే అంటున్న తల్లిదండ్రులు??

Published : Jun 13, 2023, 02:07 PM IST
నాలుగేళ్ల చిన్నారి కళ్లు పీకేసి సజీవ దహనం.. క్షుద్ర పూజలకోసమే అంటున్న తల్లిదండ్రులు??

సారాంశం

ఉత్తరప్రదేశ్ లో ఓ చిన్నారిని అతి దారుణంగా కళ్లు పీకేసి.. సజీవ దహనం చేశారు. క్షుద్రపూజల కోసమే తమ కొడుకును చంపేశారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. 

ఉత్తరప్రదేశ్‌ : ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. నాలుగేళ్ల బాలుడి కళ్లు పీకేసి... సజీవ దహనం చేశారు. అయితే క్షుద్ర పూజలే ఇందుకు కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాబు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి దర్యాప్తు ప్రారంభించారు.

వివరాల్లోకి వెళితే..అమేథీలోని జేమ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ విషాదం చోటుచేసుకుంది. రేసి గ్రామంలో నివసించే జితేంద్ర ప్రజాపతి అనే వ్యక్తి కుమారుడు దీపు. ఆ నాలుగేళ్ల చిన్నారి ఆదివారం రాత్రి నుంచి కనిపించకుండా పోయాడు. అతని తల్లిదండ్రులు ఆందోళన చెంది అతని కోసం వెతకడం ప్రారంభించారు.

బుర్ఖా వేసుకుని మద్యం కొనడానికి వచ్చిన మహిళ.. తలతీసేస్తామంటూ హెచ్చరించిన యువకులు అరెస్ట్...

అయితే సోమవారం ఉదయం గ్రామంలోని డ్రైనేజీ సమీపంలో దీపు మృతదేహం కాలిపోయి కనిపించింది. దుండగులు అతని కళ్లను కూడా పొడిచారు. ముమ్మాటికీ క్షుద్ర పూజలకే దీపు బలి అయ్యాడని తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.

ఇదిలా ఉండగా, హైదరాబాద్ కుల్సుంపురాలో 16 యేళ్ల బాలిక ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది. క్షుద్ర పూజల వల్లే ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మృతురాలు నవ్య (16)గా గుర్తించారు. గత ఆమావాస్య రోజు వారి ఇంటిముందు నిమ్మకాయలు, నల్ల బొమ్మలు పడేశారు. ఆ రోజు వాటిని చూసిన నవ్య తీవ్ర భయాందోళనలకు గురయ్యింది. 

నవ్య చాలా ధైర్యవంతురాలు, చాలా యాక్టివ్ అని.. ఆమె అక్క చెబుతోంది. దేనికీ భయపడదు. కానీ ఆ ఘటన నుంచి చాలా భయానికి గురైందని..ఒక్కతి ఉండడానికి, ఎక్కడికైనా వెళ్లడానికి భయపడుతూ తోడు రమ్మన్నదని అక్క చెబుతోంది. కాస్త చీకటి పడ్డా.. నీడలు కనిపించినా భయపడేదని.. ఆ ఘటనను ఆమె తీవ్రంగా మనసు మీదికి తీసుకుందని తెలిపింది. 

ఆమావాస్య రోజు తమ ఇంటిముందు నిమ్మకాయలు, నల్ల బొమ్మలు పడేశారు. వాటిని నవ్యనే ఊడ్చి పారేసింది. ఆ రోజు నుంచి ఆమె అలా ప్రవర్తిస్తుంది. మళ్లీ మరోరోజు కూడా తమింటి వాకింట్లో .. నిమ్మకాయలు, కుంకుమలో ముంచి వేశారు. వాటిని చూసి.. మళ్లీ వేశారని అక్కతో చెప్పింది. పట్టించుకోవద్దని చెప్పానని నవ్య సోదరి తెలిపింది. నవ్యనే వాటిని ఇంటిముందు నుంచి ఊడ్చేసి, కాల్చేసింది.

ఆ తరువాత స్నానం చేసి.. తమతో సరదాగా గడిపింది. అక్క వంట చేయి అంటే.. నేను వంట చేస్తున్నాను. గుడ్లు తెస్తానంటూ తెచ్చిచ్చింది. నేనే ఇంట్లో పైన వంట చేస్తున్నా.. అక్క నేను 5 ని.ల్లో వస్తా అని పైనుంచి కిందికి వచ్చి గదిలో ఆత్మహత్య చేసుకుంది... అని ఆమె అక్క తెలిపింది. వీరు ముగ్గురు అక్కాచెల్లెళ్లు. నవ్య రెండో అమ్మాయి. ఇంటర్ చదువుకుంటోంది. 

తమ ముగ్గురు అక్కాచెల్లెళ్లలో నవ్య చాలా ధైర్యవంతురాలని, తాను, చిన్నచెల్లె కాస్త సెన్సిటివ్, ఎవ్వరి జోలికీ వెళ్లమని ఆమె చెప్పుకొచ్చింది. తన తండ్రి పనికి వెళ్లిన తల్లిని తీసుకువచ్చేసరికే నవ్య ఆత్మహత్య చేసుకుందని తెలిపింది. క్షుద్రపూజలు చేసే తన కూతురిని చంపారని తల్లి రోధించడం అందర్నీ కలిచి వేస్తోంది. 

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం