వాషింగ్టన్ - న్యూయార్క్ కు ట్రక్ రైడ్ ను ఆస్వాదించిన రాహుల్ గాంధీ.. భారతీయ ట్రక్ డ్రైవర్ తో సుధీర్ఘ సంభాషణ

Published : Jun 13, 2023, 02:01 PM IST
వాషింగ్టన్ - న్యూయార్క్ కు ట్రక్ రైడ్ ను ఆస్వాదించిన రాహుల్ గాంధీ.. భారతీయ ట్రక్ డ్రైవర్ తో సుధీర్ఘ సంభాషణ

సారాంశం

అమెరికా పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీ ట్రక్ జర్నీని ఆస్వాదించారు. భారతీయ ట్రక్ డ్రైవర్ తో కలిసి ఆయన సుదీర్ఘ ప్రయాణంతో చేశారు. డ్రైవర్ తో ముచ్చటిస్తూ సరదాగా గడిపారు. 

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అమెరికా పర్యటన సందర్భంగా వాషింగ్టన్ డీసీ నుంచి న్యూయార్క్ కు ట్రక్కులో ప్రయాణించారు. ఈ ట్రక్ రైడ్ సమయంలో ఆయన డ్రైవర్ తో సుదీర్ఘ సంభాషణ జరిపాడు. ఈ సందర్భంగా ఆయన ట్రక్ డ్రైవర్ ను కొన్ని పాటలు ప్లే చేయాలని కోరాడు. అయితే ఏ పాట కావాలని డ్రైవర్ అడిగినప్పుడు ‘‘సిద్దూ మూస్ వాలా కా 295 లగావో  (సిద్ధూ మూస్ వాలా యొక్క 295 పాటను ప్లే చేయండి) ’’ అని సమాధానమిచ్చాడు.

వార్నీ.. తప్పతాగి రైల్వే ట్రాక్ పై పడుకున్న యువకుడు.. రైలు దిగి నిద్రలో నుంచి లేపిన లోకో పైలట్

ఒక భారతీయ డ్రైవర్ అయిన తల్జిందర్ సింగ్ తో కలిసి ట్రక్ రైడ్ ను ఆస్వాదించిన రాహుల్ గాంధీ.. అమెరికాలో పనిచేసిన అనుభవాలు, భారత్ లో ట్రక్ డ్రైవర్ జీవితం, అక్కడ ఉండే పరిస్థితులపై సుదీర్ఘంగా మాట్లాడారు. ‘మీరు ఇక్కడ ఎంత సంపాదిస్తున్నారు?’ అని రాహుల్ గాంధీ డ్రైవర్ ను అడిగారు. దానికి తల్జిందర్ సింగ్ సమాధానమిస్తూ.. భారత్ లో సంపాదిస్తున్న దానికంటే ఎక్కువ పారితోషికం తీసుకుంటున్నానని బదులిచ్చాడు.

‘‘మా ట్రక్కుల వల్లనే తయారీదారుల పని పూర్తవుతుంది’’ అని డ్రైవర్ తెలిపాడు. అయితే ట్రక్కును చూసి రాహుల్ గాంధీ ఆశ్చర్యపోయారు. ‘‘ఇక్కడ ట్రక్కులు డ్రైవర్ సౌకర్యానికి అనుగుణంగా తయారు అవుతాయి. కానీ భారతదేశంలో ఇలాంటి పరిస్థితి లేదు’’ అని అన్నారు. 

కేరళలో రోజ్ గార్ మేళాను ప్రారంభించిన కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్

గంటల పాటు సాగిన ఈ ప్రయాణంలో భారత్, అమెరికాలో డ్రైవర్ల పని పరిస్థితులు ఎలా భిన్నంగా ఉన్నాయో ఇద్దరూ చర్చించారు. ఈ సందర్భంగా భారత్ లో తాను చేసిన ట్రక్ రైడ్ ను రాహుల్ గాంధీ గుర్తు చేసుకున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం