ఉత్తరాదిన కలకలం: న్యూఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో భూకంపం

By narsimha lodeFirst Published Jun 13, 2023, 1:53 PM IST
Highlights

దేశంలోని  పలు  రాష్ట్రాల్లో  ఇవాళ  భూప్రకంపనలు  చోటు  చేసుకున్నాయి.  రిక్టర్ స్కేల్ పై  5.2 గా భూకంప తీవ్రత నమోదైంది.

న్యూఢిల్లీ:ఉత్తరాదిలోని పలు  రాష్ట్రాల్లో మంగళవారంనాడు  భూకంపం వచ్చింది.  ఢిల్లీ, పంజాబ్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లో భూప్రకంపనలు చోటు  చేసుకున్నాయి. రిక్టర్ స్కేల్ పై  5.4 తీవ్రతగా నమోదైంది.  

మంగళవారంనాడు  మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో  తూర్పు కాశ్మీర్ లో భూకంపం  సంభవించిందని  యూరోపియన్ మెడిటరేనియన్  సిస్మోలాజికల్ సెంటర్ తెలిపింది.
జమ్మూలోని దొడ్డా జిల్లాలోని గండో భలెస్సా  గ్రామానికి  18 కిలోమీటర్ల దూరంలో 30 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది.  జమ్మూ కాశ్మీర్ సహా  ఢిల్లీ పరిసర ప్రాంతాలు ఉత్తరాదిన  పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు  చోటు  చేసుకున్నాయి. 

 భూకంపంతో  ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఇళ్లలో నుండి ప్రజలు బయటకు పరుగులు తీశారు. భూకంపానికి సంబంధించిన  దృశ్యాలను కొందరు  సోషల్ మీడియాలో షేర్  చేశారు. 


 

click me!