అమెజాన్ మేనేజర్ హత్య కేసులో మరో 2 మంది అరెస్ట్, ఐదవ నిందితుడికోసం గాలింపు....

Published : Sep 01, 2023, 03:44 PM IST
అమెజాన్ మేనేజర్ హత్య కేసులో మరో 2 మంది అరెస్ట్, ఐదవ నిందితుడికోసం గాలింపు....

సారాంశం

అమెజాన్ మేనేజర్ హత్య కేసులో మొత్తం నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. చివరి, ఐదవ ఐదవ నిందితుడికోసం గాలింపు చేపట్టారు. 

న్యూఢిల్లీ : ఈశాన్య ఢిల్లీలోని భజన్‌పురా ప్రాంతంలో అమెజాన్ ఎగ్జిక్యూటివ్‌ను హత్య చేసిన కేసులో మరో ఇద్దరిని అరెస్టు చేసినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. నిందితులను భజన్‌పురాలోని నూర్-ఎ-ఎలాహి నివాసి సోహైల్ (23), భజన్‌పురాలోని మోహన్‌పురి నివాసి జుబైర్ (23)గా గుర్తించినట్లు వారు తెలిపారు.

దీంతో ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం నలుగురిని అరెస్టు చేసినట్లైంది. గురువారం రాత్రి 11:30 గంటల ప్రాంతంలో, నిందితుల గురించి పోలీసులకు పక్కా సమాచారం అందిందని, పంజాబ్‌కు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో బురారీ సమీపంలో వారిని అరెస్టు చేశామని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఈశాన్య) జాయ్ టిర్కీ తెలిపారు.

అమెజాన్ సీనియర్ మేనేజర్ హ‌త్య వెనుక 18 ఏండ్ల యువ‌కుడు.. కానీ అత‌ని గురించి తెలిస్తే షాక్ అవుతారు.. !

ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో సీనియర్ మేనేజర్‌గా పనిచేసిన హర్‌ప్రీత్ గిల్ (36), అతని మామ గోవింద్ సింగ్ (32)  ఇద్దరు మంగళవారం అర్థరాత్రి ఈశాన్య ఢిల్లీలోని సుభాష్ విహార్ ప్రాంతంలో మోటార్ సైకిల్ పై ప్రయాణిస్తుండగా కాల్పులు జరిగాయి. ఇందులో వీరిద్దరు గాయపడ్డారు. అనంతరం ఆసుపత్రిలో గిల్ మరణించినట్లు ప్రకటించారు.

సింగ్ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యాడు. ప్రస్తుతం ఇంట్లో కోలుకుంటున్నాడు. కేసు విచారణకు సహకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కాల్పుల్లో ఐదవ, చివరి నిందితుడు అద్నాన్ పరారీలో ఉన్నాడని, అతడిని అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని వారు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

2026 Sankranthi celebrations in Delhi | PM Modi Powerful Pongal Speech | Asianet News Telugu
Makarajyothi: ఘనంగా మకర జ్యోతి ఉత్సవం.. దర్శనానికి పోటెత్తిన లక్షలాది స్వాములు | Asianet News Telugu