చెల్లని వివాహాలు.. వాళ్లకి పుట్టిన సంతానికి ఆస్తిలో వాటా ఇవ్వాల్సిందే : సుప్రీంకోర్ట్ సంచలన తీర్పు

Siva Kodati |  
Published : Sep 01, 2023, 02:54 PM ISTUpdated : Sep 01, 2023, 02:56 PM IST
చెల్లని వివాహాలు.. వాళ్లకి పుట్టిన సంతానికి ఆస్తిలో వాటా ఇవ్వాల్సిందే : సుప్రీంకోర్ట్ సంచలన తీర్పు

సారాంశం

చెల్లని వివాహం ద్వారా ఒక్కటైన జంటలకు పుట్టిన పిల్లలు తల్లిదండ్రుల ఆస్తిలో వాటాకు అర్హులని సుప్రీంకోర్ట్ గురువారం సంచలన తీర్పును వెలువరించింది.  అయితే హిందూ వారసత్వ చట్టం ప్రకారం మాత్రమే ఆస్తిలో వాటా లభిస్తుందని న్యాయస్థానం వెల్లడించింది. 

చెల్లని వివాహం ద్వారా ఒక్కటైన జంటలకు పుట్టిన పిల్లలు తల్లిదండ్రుల ఆస్తిలో వాటాకు అర్హులని సుప్రీంకోర్ట్ గురువారం సంచలన తీర్పును వెలువరించింది. అలాంటి పిల్లలకు చట్టబద్ధంగా ఆస్తి చెందుతుందని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఆస్తిలో వాటా పొందేందుకు వారు దావా వేయొచ్చని సుప్రీం పేర్కొంది. అయితే హిందూ వారసత్వ చట్టం ప్రకారం మాత్రమే ఆస్తిలో వాటా లభిస్తుందని న్యాయస్థానం వెల్లడించింది. చెల్లని వివాహాలకు పుట్టిన సంతానానికి తల్లిదండ్రుల పూర్వీకుల ఆస్తిలో ఎటువంటి హక్కు వుండదంటూ గతంలో చెప్పిన తీర్పును సుప్రీంకోర్ట్ సవరించింది. 

ఈ నెల ప్రారంభంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం 2011లో హిందూ చట్టాల ప్రకారం చెల్లని వివాహాలు చేసుకున్న తల్లిదంద్రులు ఆస్తిలో వాటాను పొందొచ్చా లేదా అన్న దానిపై దాఖలైన పిటిషన్‌ను విచారించింది. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్ట్.. హిందూ వివాహ చట్టంలోని సంబంధిత సెక్షన్ల ప్రకారం తల్లిదండ్రుల స్వీయ ఆర్జిత ఆస్తులకు మాత్రమే పరిమితం కావాలా అని కూడా నిర్ణయించింది. ఈ ప్రశ్నలను ఇద్దరు న్యాయమూర్తుల బెంచ్ మార్చి 2011లో ప్రస్తావించింది. 

అప్పటి తీర్పులో చెల్లని వివాహం చేసుకున్న తల్లిదండ్రులకు పుట్టిన సంతానం కేవలం తన పేరెంట్స్ సంపాదించిన ఆస్తిపై మాత్రమే హక్కును కలిగి వుంటారని పేర్కొంది. హిందూ వివాహ చట్టం ప్రకారం.. చెల్లని వివాహం చేసుకున్న పార్టీలకు భర్త లేదా భార్య హోదా వుండదు. చట్టం ప్రకారం.. రెండు పార్టీలు చల్లని వివాహ స్థితిని కలిగి వుంటాయ. అలాగే చెల్లని వివాహాన్ని రద్దు చేయడానికి ఎలాంటి డిక్రీ అవసరం లేదు. 

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్