కర్ణాటక అసెంబ్లీ మాజీ స్పీకర్ డీబీ చంద్రేగౌడ మృతి.. ఇందిరా గాంధీ కోసం పదవిని త్యాగం చేసిన నేత ఇక లేరు..

By Asianet News  |  First Published Nov 7, 2023, 2:22 PM IST

D.B Chandregowda : కర్ణాటక రాజకీయ చరిత్రలో సుధీర్ఘ స్థానం ఉన్న ఓ నేత అస్తమించారు. దాదాపు ఐదు పార్టీల్లో వివిధ పదవులు చేపట్టి, సేవలు అందించిన  డీబీ చంద్రేగౌడ కన్నుమూశారు. ఆయన మంత్రిగా, లోక్ సభ సభ్యుడిగా, రాజ్యసభ సభ్యుడిగా, శాసన సభ స్వీకర్ గా బాధ్యతలు నిర్వర్తించారు.


D.B Chandregowda : కర్ణాటక శాసనసభ మాజీ స్పీకర్, దారదహళ్లి బైరెగౌడ చంద్రేగౌడ (87) ఇక లేరు. ఆయన మంగళవారం తెల్లవారుజామున చిక్కమగళూరు జిల్లా దారదహళ్లిలోని తన నివాసంలో కన్నుమూశారు. కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లా ముదిగెరె తాలూకా దారదహళ్లిలో 1936 ఆగస్టు 26న జన్మించిన ఆయన.. సుదీర్ఘ రాజకీయ జీవితం గడిపారు. 

ఏమైనా చేయండి.. కానీ పంట వ్యర్థాలను కాల్చడం ఆపండి..-పంజాబ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం.. ఎందుకంటే ?

Latest Videos

మూడుసార్లు ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, మూడుసార్లు లోక్ సభ సభ్యుడిగా సేవలు అందించారు. డి.బి.చంద్రేగౌడ మొదటి సారిగా 1971లో కాంగ్రెస్ పార్టీ తరఫున చిక్ మగళూరు నియోజకవర్గం నుంచి 5వ లోక్ సభకు ఎన్నికయ్యారు. 1977లో 6వ లోక్ సభకు తిరిగి ఎన్నికయ్యారు. అయితే 1978లో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పోటీ చేసేందుకు ఆయన తన లోక సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆ ఉప ఎన్నికల్యలో ఆమె విజయం ఎమర్జెన్సీ తర్వాత కాంగ్రెస్ కు ఉత్సాహాన్ని ఇవ్వడంలో తోడ్పడింది. 1978 నుండి 1983 వరకు కాంగ్రెస్ తరుపున శాసన మండలిలో సభ్యుడిగా కొనసాగారు. 

bhupesh baghel : అమిత్ షా ఛాలెంజ్ ను స్వీకరించిన ఛత్తీస్‌ఘడ్‌ సీఎం.. చర్చకు తేదీ, వేదిక, సమయం చెప్పాలన్న బఘేల్

తిరుత్తల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 1983-1985 మధ్య కాలంలో జనతాదళ్ తరఫున మూడు పర్యాయాలు రాష్ట్ర శాసనసభ సభ్యుడిగా చంద్రేగౌడ ఉన్నారు. అలాగే 1989- 1994 వరకు అదే పార్టీ టిక్కెట్ పై ఎమ్మెల్యేగా కొనసాగారు. 1999లో శృంగేరి కన్సల్టెన్సీ నుంచి కాంగ్రెస్ టికెట్ పై అసెంబ్లీలో అడుగుపెట్టారు. అప్పటి నుంచి 2004 వరకు న్యాయ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా సేవలు అందించారు. ఆయన 2009లో బెంగళూరు నార్త్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి బీజేపీ తరుఫన లోక్ సభలో కాలుమోపారు. 

ఘోర రోడ్డు ప్రమాదం.. లోయలో పడిన బస్సు.. ముగ్గురు మృతి, 15 మందికి గాయాలు

1986లో జనతా పార్టీ తరుఫన రాజ్యసభకు ఎన్నికయ్యారు. తరువాత ఆ పార్టీ జనతాదళ్ గా మారింది. మొత్తంగా చంద్రేగౌడ తన రాజకీయ జీవితంలో ప్రజా సోషలిస్టు పార్టీ, కర్ణాటక క్రాంతి రంగా, జనతా పార్టీ, జనతాదళ్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ప్రాతినిధ్యం వహించారు. ఇది కర్ణాటక రాజకీయ చరిత్రలో ఒక అరుదైన ఘనతగా నిలిచింది. 

click me!