కరోనా సోకి.. రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత

Published : May 20, 2021, 08:23 AM IST
కరోనా సోకి.. రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత

సారాంశం

ప్రముఖ కాంగ్రెస్ నేత, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ పహాడియా కరోనాతో మృతిచెందారు. బుధవారం ఆయన చికిత్స పొందుతూ మరణించినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.  

కరోనా మహమ్మారి దేశంలో రోజు రోజుకీ విజృంభిస్తోంది. కొంతలో కొంత కేసులు తగ్గుముఖం పడుతున్నప్పటికీ.. మరణాల సంఖ్య మాత్రం బాగా పెరిగిపోతోంది. ఇప్పటికే చాలా మంది ప్రముఖులు ఈ కరోనాకి బలయ్యారు. తాజాగా మరో ప్రముఖుడు కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు.

ప్రముఖ కాంగ్రెస్ నేత, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ పహాడియా కరోనాతో మృతిచెందారు. బుధవారం ఆయన చికిత్స పొందుతూ మరణించినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

పహాడియా మృతిపట్ల సంతాపం తెలిపారు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్. మొదటినుంచి పహాడియా ఆయనకు శ్రేయోభిలాషిలా ఉండేవారని గుర్తుచేసుకున్నారు. గురువారం రాష్ట్ర అధికారిక లాంఛనాలతో పహాడియా అంత్యక్రియలు జరగనున్నట్లు తెలిపారు.జగన్నాథ్ 1980-81లో రాజస్థాన్​ ముఖ్యమంత్రిగా పనిచేశారు. హరియాణా, బిహార్​కు గవర్నర్​గా విధులు నిర్వహించారు.

కరోనా మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ మాస్కులు తప్పకుండా ధరించాలని, శానిటైజ్ చేసుకోవాలని, సామాజిక దూరం పాటించాలని ఏషియానెట్ విజ్ఢప్తి చేస్తోంది. సాధ్యమైనంత త్వరగా కరోనా టీకా తీసుకోవాలని కూడా కోరుతోంది. అందరం కలిసి కరోనా వ్యాప్తిని అరికడుదాం, మనల్ని మనం రక్షించుకుందాం.  #ANCares #IndiaFightsCorona

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్