కరోనా వ్యాక్సిన్‌‌పై కేంద్రం కొత్త గైడ్‌లైన్స్: అలా అయితే మూడు నెలలు ఆగాల్సిందే

By narsimha lodeFirst Published May 19, 2021, 5:11 PM IST
Highlights

ఫస్ట్ డోస్ తీసుకొన్న తర్వాత  కరోనా వస్తే  3 నెలల తర్వాత సెకండ్ డోస్ వేసుకోవాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. 


న్యూఢిల్లీ:  ఫస్ట్ డోస్ తీసుకొన్న తర్వాత  కరోనా వస్తే  3 నెలల తర్వాత సెకండ్ డోస్ వేసుకోవాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. కరోనా వ్యాక్సినేషన్ పై కేంద్రం బుధవారం నాడు మార్గదర్శకాలను విడుదల చేసింది.  ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో నెగిటివ్ వచ్చిన 14 రోజుల తర్వాత రక్తదానం చేయవచ్చని ప్రభుత్వం ప్రకటించింది. పాలిచ్చే మహిళలు టీకాలు తీసుకోవచ్చని కూడ వైద్య ఆరోగ్య శాఖ సిఫారసు చేసింది. టీకా తీసుకోవడానికి ముందు రాపిడ్ యాంటిజెన్ టెస్ట్  చేయాల్సిన అవసరం లేదని  కేంద్రం స్పష్టం చేసింది. 

అనారోగ్య లక్షణాలు లేదా ఇతరత్రా సమస్యలతో ఆసుపత్రుల్లో చేరిన వారు  నాలుగు నుండి 8 వారాల తర్వాత  వ్యాక్సిన్ తీసుకోవాలని ఆరోగ్య శాఖ తెలిపింది. నేషనల్ ఎక్స్‌పర్ట్ గ్రూప్ కరోనా వ్యాక్సిన్ పై కొత్త మార్గదర్శకాలను రూపొందించింది. ఈ గైడ్‌లైన్స్ కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ఆమోదించింది.ఈ మార్గదర్శకాలను రాష్ట్రాలకు పంపింది.దేశంలో కరోనా  కేసుల వ్యాప్తిని తగ్గించేందుకు  పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు. లాక్‌డౌన్ అమలు చేయడం వల్ల కరోనా కేసుల నమోదు తగ్గుతున్నట్టుగా గణాంకాలు చెబుతున్నాయి. 

click me!